‘10మంది పిల్లల్ని కనండి-దేవుడే చూసుకుంటాడు’
హిందువుల జనాభా పెరగాల్సిన ఆవశ్యకత ఉందని జ్యోతిర్ మఠ్‌లో శంకరాచార్య హోదాలో వాసుదేవానంద్ సరస్వతి అన్నారు.
నాగపూర్: హిందువుల జనాభా పెరగాల్సిన ఆవశ్యకత ఉందని జ్యోతిర్ మఠ్‌లో శంకరాచార్య హోదాలో వాసుదేవానంద్ సరస్వతి అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగిన ధర్మ సంస్కృతి మహాకుంబ్ ముగింపు సమావేశాల్లో వాసుదేవానంద్ పాల్గొన్నారు.

'సేవ్ హిందూ' పేరిట జరిగిన ఈ కార్యక్రమంలో వాసుదేవానంద్ మాట్లాడారు. 'ప్రతీ హిందువు ఇక నుంచి 10 మంది పిల్లల్ని కనాలి. దేవుడే వారిని రక్షిస్తాడు' అంటూ హితబోధ చేశారు. హిందూ జనాభా పెరగాల్సిన అవసరం ఉందన్నారు.
నోట్ల రద్దుపై ప్రధాని నరేంద్ర మోడీ ఎలాగైతే ఒక నిర్ణయం తీసుకున్నారో.. అలాగే
దేశంలో గోవధను నిషేధించాలని ఆయన మోడీకి విన్నవించారు. కాగా, జ్యోతిర్ మఠ్‌లో శంకరాచార్య హోదాలో కొనసాగుతున్న వాసుదేవానంద్ సరస్వతి.. ఆ హోదాకు తగరు అంటూ న్యాయ విచారణ సైతం ఎదుర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications