వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'కోతి'.. 'వైరస్'.. ఇంకా చాలా, నన్నిలా తిట్టారు: ఎన్నికలవేళ.. తిట్లను ఏకరువు పెట్టిన మోడీ..

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: 2002 నుంచి గుజరాత్‌లో తిరుగులేని శక్తిగా ఉన్న బీజేపీకి ఈ దఫా ఎన్నికలు అంతర్గతంగా తీవ్ర కలవరపెడుతున్నాయి. ఇంతకుముందు ఎన్నికలన్ని నల్లేరు మీద నడకలాగే సాగినా.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన పాలనకు సహజంగానే వ్యక్తమయ్యే వ్యతిరేకతకు తోడు పాటిదార్ ఉద్యమం కూడా ఈసారి బీజేపీకి ప్రతికూలంగా మారింది. జిగ్నేష్ మేవాని, అల్ఫేష్ ఠాకూర్, హార్థిక్ పటేల్ లాంటి యువ నాయకత్వం బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా ప్రచారం చేసింది. దీంతో బీజేపీ గెలుపుపై ఆ పార్టీలోనే అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి.

 కాంగ్రెస్ పుంజుకుంది:

కాంగ్రెస్ పుంజుకుంది:

గుజరాత్ లో బీజేపీ పడిపోతే ఆటోమేటిగ్గా ఆ ప్రతికూలత కాంగ్రెస్ కు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ప్రధానంగా పాటిదార్ ఉద్యమ నాయకుడు హార్థిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతునివ్వడం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వాతావరణాన్ని పూర్తిగా మార్చేసిందనే చెప్పాలి. ఈ పరిణామాలతో అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకుంది.

Recommended Video

Narendra Modi in Chennai : PM Meets DMK Chief Karunanidhi
సానుభూతి కోసమా?:

సానుభూతి కోసమా?:

ఎన్నికలవేళ.. కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ కొత్త అస్త్రాన్ని బయటకు తీశారు. వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ నేతలు తనను తిట్టిన తిట్ల జాబితాను ఏకరువు పెట్టి సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారు.

కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన మణిశంకర్ తనపై చేసిన 'నీచ్' వ్యాఖ్యలతో ఢిల్లీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిన సంగతి తెలిసిందే. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నికోల్‌లో నిర్వహించిన ర్యాలీలో మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల తిట్ల దండకాన్ని ప్రజల ముందు ఉంచారు.

 'నన్నిలా తిట్టారు':

'నన్నిలా తిట్టారు':

  • కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఇతర నేతలు కూడా నన్ను 'నీచ్' అన్నారు.
  • పాకిస్థాన్‌లో మణిశంకర్ అయ్యర్ మాట్లాడుతూ నన్ను తమ దారి నుంచి అడ్డు తొలగిస్తామన్నారు.
  • తక్కువ కులంలో పుట్టడం, పేద కుటుంబంలో జన్మించినందుకే వారు నన్ను అలా పిలుస్తున్నారు.
  • కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ నన్ను చాలా అసభ్యంగా పేర్కొంటూ ట్వీట్ చేశారు. అది చెప్పడానికి కూడా నోరు రావడం లేదు.
  •  'కోతి అన్నారు':

    'కోతి అన్నారు':

    ఒక గుజరాతీ, పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడని దిగ్విజయ్ సింగ్ నన్ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.

    • 'మోదీ సర్కారు రాక్షస రాజ్యం. మోదీ రావణుడు' అని దిగ్విజయ్ నన్ను అభివర్ణించారు.
    • మోదీ హిట్లర్, ముస్సోలిని, గడాఫీ.. అని యూపీ కాంగ్రెస్ హెడ్ ప్రమోద్ తివారీ అన్నారు.
    • మరో నేత నన్ను కోతి అన్నారు.
    • జైరామ్ రమేశ్ నన్ను భస్మాసురుడిగా అభివర్ణించారు
    • తిట్లు ఏకవరువు
      'వైరస్ అన్నారు':


      బేణీ ప్రసాద్ వర్మ నన్ను పిచ్చి కుక్క అన్నారు. పిచ్చి కుక్కను గెలవనివ్వబోమని శపథం కూడా చేశారు.

      • ఇమ్రాన్ మసూద్ అయితే నన్ను ఖండఖండాలుగా నరుకుతానని అన్నారు.
      • రేణుకా చౌదరి నన్ను వైరస్ అన్నారు.
      • మొన్న అయ్యర్ నన్ను నీచ్ జాతి వ్యక్తినని అన్నారు.. అంటూ కాంగ్రెస్ నేతలు వివిధ సందర్భాల్లో తనను అన్న మాటలను బయటపెట్టారు.

English summary
Launching his fiery broadside with an attack on the Gandhi family, PM Modi said Congress president Sonia Gandhi had used the epithet 'neech' to describe him in the past.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X