3 వేల ఫోర్న్ సైట్లు బ్లాక్ చేశాం, అశ్లీల సైట్లపై నిరంతరం నిఘా: కేంద్రం

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ:ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక ఫోర్న్ సైట్ల సంఖ్య కూడ పెరిగిపోయింది. వీటిని బ్లాక్ చేయాలని ఎప్పటి నుండో డిమాండ్ ఉంది.సుప్రీం కోర్టు కూడ కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

కేంద్ర ప్రభుత్వం మూడు వేలకు పైగా ఫోర్న్ సైట్లను బ్లాక్ చేసింది. లోక్ సభలో కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ ఈ విషయాన్ని లిఖితపూర్వకంగా తెలిపింది. ఛైల్డ్ ఫోర్నోగ్రఫిక్ వెబ్ సైట్లు భారత్ వెలుపలివేనని పేర్కొంది.ఈ వెబ్ సైట్ యూఆర్ఎల్ ను బ్లాక్ చేశామని హోంమంత్రిత్వశాఖ పేర్కొంది.

have blocked 3,000 porn websites, government tells Lok Sabha

మహిళలు, పిల్లలు సైబర్ క్రైమ్ బారినపడకుండా అడ్డుకొనేందుకుగాను కేంద్ర హోంశాఖ ప్రత్యేక చర్యలు తీసుకొంటోందని కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పెరిగిపోతోందని పిల్లలపై వేధింపులకు సంబంధించి ఇంటర్ పోల్ ఎప్పటికప్పుడు ఓ జాబితాను అప్ డేట్ చేస్తోందని తెలిపింది.

ఐటీ చట్టం, 2000 ప్రకారం అభ్యంతరకరమైన ఆన్ లై,న్ కంటెంట్ ను తొలగించవచ్చు. ఇలాంటి వాటిపై నిరంతరం అప్రమత్తంగా ఉన్నట్టు ఐటీ మంత్రిత్వశాఖ పేర్కొంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
the government informed Parliament on Wednesday that it had blocked 3,000 websites which hosted pornographic content.
Please Wait while comments are loading...