జయ మృతిపై మాకు అనుమానాలు ఉన్నాయి: మద్రాస్ హై కోర్టు

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై మాకు అనుమానాలు ఉన్నాయని, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసు విచారణ జనవరి 10వ తేదికి వాయిదా వేస్తున్నామని న్యాయమూర్తి వైద్యనాథన్ తెలిపారు. జయలలిత ఎలా మరణించారు ? ఎలా చికిత్స చేశారు ? ఏ కారణంగా ఆమె మరణించారు ? అనే పూర్తి వివరాలు కోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తి వైద్యనాథన్ ఆదేశాలు జారీ చేశారు.

జయలలిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని, సుప్రీం కోర్టు రిటైడ్ న్యాయమూర్తులు ముగ్గురితో కమిటి ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని చెన్నైలోని అరుంబాక్కంకు చెందిన జోసెఫ్ అనే అన్నాడీఎంకే నాయకుడు మద్రాసు హై కోర్టులో అర్జీ సమర్పించారు.

 Have doubts over Jayalalithaa's death and treatment: Madras HC

గురువారం మద్రాసు హై కోర్టు న్యాయమూర్తి వైద్యనాథన్ అర్జీ విచారించారు. జయలలిత ఎలా మరణించారు అని ప్రజలకు తెలియాలని, అందుకు పూర్తి విరాలు కోర్టు ముందు సమర్పించాలని జోసెఫ్ న్యాయవాది కోర్టులో మనవి చేశారు.

జయలలిత తొలుత జర్వంతో చికిత్స పొందుతున్నారని అపోలో ఆసుపత్రి వైద్యులు చెప్పారని, త్వరలో డిశ్చార్జి చేస్తామని చెప్పారని, చివరికి అమ్మకు గుండెపోటు రావడంతో మరణించాని ఆసుపత్రి వర్గాలు చెప్పాయని కోర్టులో చెప్పారు.

అపోలో ఆసుపత్రి పొంతన లేకండా జయ ఆరోగ్యంపై బులిటెన్లు విడుదల చెయ్యడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని జోసెఫ్ న్యాయవాది కోర్టులో చెప్పారు. అంతేకాకుండా జయలలిత పార్థీవదేహాన్ని చూసిన ప్రజలు ఆమె కాళ్లు తొలగించారని గమనించారని, పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని కోర్టులో చెప్పారు. పిటిషనర్ వాదనలు పరిశీలించి న్యాయస్థానం జయలలిత చికిత్స వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+