వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నలుగురు పిల్లల వ్యాఖ్యపై షోకాజ్: అందలేదన్న 'సాక్షి'

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రతి హిందూ మహిళ నలుగురేసి పిల్లలను కనాలనే వ్యాఖ్య చేసినందుకు పార్టీ నాయకత్వం బిజెపి పార్లమెంటు సభ్యుడు సాక్షి మహరాజ్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. అయితే, తనకు అటువంటి నోటీసు ఏదీ రాలేదని సాక్షి మహరాజ్ అన్నారు. నోటీస్ అందితే దానికి సమాధానం ఇస్తానని ఆయన ఆయన చెప్పారు.

తాను ఇప్పుడే ఢిల్లీకి వచ్చానని, నోటీసు పంపించి ఉంటే తన కార్యాలయం తీసుకుని ఉంటుందని, ఇది ఇంటి విషయమని (అంతర్గత వ్యవహారమని) అంటూ మీడియా ఎందుకు దూరుతోందని అడిగారు. బిజెపి ఆయనకు సోమవారంనాడు షోకాజ్ నోటీసు జారీ చేసింది.

ప్రతి హిందూ మహిళ నలుగురేసి పిల్లలను కనాలనే ప్రకటన ద్వారా బిజెపి పార్లమెంటు సభ్యుడు సాక్షి మహరాజ్ సృష్టించిన వివాదం సృష్టించారు. హిందూ మతాన్ని పరిరక్షించడానికి ప్రతి మహిళ నలుగురేసి పిల్లలను కనాలని సాక్షి మహరాజ్ ఈ మధ్య ఓ ప్రకటన చేశారు. ఆ ప్రకటనతో తీవ్ర వివాదం చెలరేగింది. బిజెపి ఆ ప్రకటనతో తమకు సంబంధం లేదని కూడా వ్యాఖ్యానించింది.

'Haven't Got Any Showcause Notice From Party Yet,' Says BJP Lawmaker Sakshi Maharaj

బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా సాక్షి మహరాజ్ ప్రకటనతో విభేదించారు. అటువంటి ప్రకటనలతో పార్టీకి నష్టం జరుగుతుందని కూడా వ్యాఖ్యానించారు. అయితే, తాను తప్పేమీ మాట్లాడలేదని సాక్షి మహరాజ్ సమర్థించుకోవడానికి ప్రయత్నించారు.

ఆ వివాదం సమసిపోక ముందే, విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి) మహిళా నేత అదే ప్రకటన చేశారు. ప్రతి దంపతుల నుంచి తమకు నలుగురేసి పిల్లలు కావాలని ఆమె అన్నారు. విశ్వహిందూ పరిషత్ విరాట్ హిందూ పేర ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ఆ వ్యాఖ్యలు చేశారు.

ప్రతి హిందూ మహిళ నుంచి నలుగురు పిల్లలు కావాలని ఆమె అన్నారీు. వారిలో ఒకర దేశ సరిహద్దులను కాపాడుతారని, ఒకరిని హిందూ సన్యాసులకు బహుమతిగా ఇవ్వాలని, మూడో సంతానాన్ని విహెచ్‌పి ఇవ్వాలని, తద్వారా సామాజిక సేవ చేయవచ్చునని, నాలుగో సంతానం భారత సంస్కృతిని పరిరక్షించడానికి పనికి వస్తుందని ఆమె వివరించారు.

English summary
BJP lawmaker Sakshi Maharaj has denied receiving any showcause notice by the party in response to his recent controversial comments
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X