Udhayanidhi Stalin:అందుకే నాపై ఈ పిటిషన్..మంత్రి సంచలన వ్యాఖ్యలు..!
చెన్నై: మంత్రిగా, ప్రజా ప్రతినిధిగా ఉదయనిధి స్టాలిన్‌ను తప్పించాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకే తనపై ఈ పిటిషన్ దాఖలు చేశారని మద్రాస్ హైకోర్టుకు ఉదయనిధి తెలిపారు. సైద్ధాంతిక విబేధాల కారణంగానే ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు మంత్రి కోర్టుకు వివరించారు.
మంత్రి ఉదయనిధి స్టాలిన్ తరపున వాదనలు వినిపించారు సీనియర్ కౌన్సెల్ పి.విల్సన్. ఈ సందర్భంగా ఆయన రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 గురించి ప్రస్తావించారు.నచ్చిన మతాన్ని స్వీకరించి ఆచరించే హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 చెబుతోందని గుర్తుచేశారు. అదే సమయంలో నాస్తికత్వం కూడా ఆచరిస్తూ దాని గురించి ప్రచారం చేసే హక్కు రాజ్యాంగం కల్పిస్తోందని తెలిపారు. ఆర్టికల్ 25 రెడ్ విత్ ఆర్టికల్ 19(1)(A)(స్వేఛ్ఛ భావవ్యక్తీకరణ) ప్రకారం ఉదయనిధి చేసిన ప్రసంగంలో తాను ఎక్కడా హద్దులు దాటలేదని సీనియర్ అడ్వకేట్ పి.విల్సన్ కోర్టులో తన వాదనలు వినిపించారు.

సనాతన ధర్మం పట్ల ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ తాను మంత్రిగా కొనసాగే హక్కు లేదంటూ హిందూ సంస్థ పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ పై స్పందించిన ఉదయనిధి స్టాలిన్ తరపున న్యాయవాది విల్సన్ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. డీఎంకే ద్రవిడ సిద్ధాంతాలను బలంగా నమ్ముతుందని, ద్రవిడ సిద్ధాంతం ఆత్మ గౌరవం, సమానత్వం,సోదరభావం గురించి చెబుతుందని చెప్పుకొచ్చారు. ఎవరైతే ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు తప్పుబడుతున్నారో వారంతా కులాలను వేరు చేసి మాట్లాడేవారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఇరువైపుల నుంచి వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణ అక్టోబర్ 31కి వాయిదా వేశారు.అంతేకాదు ఉదయనిధి ఏ కార్యక్రమంలో అయితే ఈ వ్యాఖ్యలు చేశారో వాటికి సంబంధించిన ఇన్విటేషన్‌తో పాటు, ఆ కార్యక్రమానికి హాజరైన వారి జాబితా కూడా కోర్టు ముందుంచాలంటూ పిటిషనర్లను గౌరవ న్యాయస్థానం ఆదేశించింది.












Click it and Unblock the Notifications