హజారే నాకు ప్రయివేట్‌గా: కేజ్రీ, కిరణ్ బేడీ కంటతడి, కేజ్రీవాల్‌కు ఈసీ క్లీన్‌చిట్

న్యూఢిల్లీ: తనను నైస్ లేడీ అన్న ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్‌కు భారతీయ జనతా పార్టీ ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ కౌంటర్ ఇచ్చారు. అతనిది వంచించే గుణమని ధ్వజమెత్తారు. అరవింద్ కేజ్రీవాల్ సానుభూతి కోసం అరెస్టు కావాలనుకుంటున్నారని ఆరోపించారు.

కాగా, ఎన్నికల ప్రచారం సమయంలో కిరణ్ బేడీ ప్రచారానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. దీంతో అమె కంటతడి పెట్టారు. ప్రజలు చూపిస్తున్న అభిమానానికి ఆమె ఉద్వేగానికి లోనయ్యారు. మరోవైపు, తన పైన, తమ పార్టీ పైన వచ్చిన అవినీతి ఆరోపణల పైన అరవింద్ కేజ్రీవాల్ సవాల్ చేశారు.

ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. విరాళాలలో ఒక్క రూపాయి కూడా బోగస్ లేదన్నారు. తనకు అన్నా హజారే ప్రయివేటుగా ఆశీర్వాదం ఇచ్చారని, పబ్లిక్‌గా ఇవ్వలేదని చెప్పారు.

కేజ్రీవాల్‌కు ఈసీ క్లీన్ చిట్

'He is manipulative': Kiran Bedi on Arvind Kejriwal Who Called her 'Nice Lady'

అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్నికల సంఘం క్లీన్ చిట్ ఇచ్చింది. ఉత్తర ప్రదేశ్ వాసి అయిన కేజ్రీకి ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు లేదని హైకోర్టుకు ఎక్కారు. దీని పైన కోర్టు విచారణ జరిపింది. కేజ్రీవాల్‌కు ఢిల్లీలో ఓటు హక్కు ఉందని ఈసీ న్యాయస్థానానికి తెలిపింది. అతనికి క్లీన్ చిట్ ఇచ్చింది.

అది అబద్ధాల ఏఏపీ

సిగ్గులేనితనానికి కూడా పరిమితులు ఉండాలని వ్యాఖ్యానిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఆమ్ ఆద్మీ పార్టీపై పదునైన పదజాలంతో ధ్వజమెత్తారు. ఆమ్ ఆద్మీ పార్టీకి తప్పుడు మార్గాల్లో విరాళాలు వచ్చాయన్న అంశాన్ని ప్రస్తావించిన మోడీ ఇతరులకంటే తామే నిజాయితీపరులమని చెప్పుకునే వారి అసలు రంగు బయటపడిందన్నారు. అబద్ధాలతోనూ, నీతిబాహ్యతతోనూ ఆమ్‌ఆద్మీ పార్టీ ఢిల్లీని ఏవిధంగా పరిపాలించగలుగుతుందన్నారు.

ఢిల్లీ ప్రచారంలో భాగంగా జరిగిన ర్యాలీలో మాట్లాడిన మోడీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కూడా ధ్వజమెత్తారు. ఈ తల్లీకొడుకులిద్దరూ తన గురించి మాట్లాడితేనే ప్రజలు కనీసం వారిమాట వింటున్నాని మోడీఅన్నారు. గత పదిహేను సంవత్సరాలుగా కాంగ్రెస్ పాలనలో ఢిల్లీ అన్ని రకాలుగా నష్టపోయిందని మోడీ తెలిపారు.

అలాగే ఆపద్ధర్మ పార్టీగా తెరపైకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏడాదిపాటు ఢిల్లీని నాశనం చేసిందని దుయ్యబట్టారు. ఈ నష్టాన్ని, కష్టాన్ని తొలగించి ఢిల్లీని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించాల్సిన బాధ్యత బీజేపీదే అన్నారు. అబద్ధాలతోను, బూటకపు చర్యలతోనూ ఢిల్లీని పాలించడం సాధ్యం కాదని, అతి తెలివిగా వ్యవహరించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, ఉన్నచోటే సత్తా చూపించుకోవాలని, అగ్నిపరీక్షను నెగ్గాలని మోడీ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+