వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రశాంత్ కిషోర్‌ యూజ్‌లెస్: బీజేపీ కోసమే - సర్వేలన్నీ: ఈ మాట చెప్పిందెవరో కాదు..!!

|
Google Oneindia TeluguNews

పాట్నా: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌పై విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. ఆయన వైఖరి పట్ల తీవ్ర అసహనం వ్యక్తమౌతోంది. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో వైెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీగా మెజారిటీతో విజయం సాధించడానికి వ్యూహాలను రచించిన ఆయన- ఇప్పుడు తాజాగా బిహార్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్నారు. అక్కడ అధికారంలో ఉన్న జనతాదళ్ (యునైటెడ్)లో ఉపాధ్యక్షుడిగా పని చేసిన ప్రశాంత్ కిషోర్- ఇప్పుడదే పార్టీపై ఘాటు విమర్శలు సంధిస్తోన్నారు.

బిహార్ పరిణామాలపై..

బిహార్ పరిణామాలపై..

బిహార్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై ప్రశాంత్ కిషోర్ మరోసారి స్పందించారు. రాజకీయ అస్థిరత ఇంకా కొనసాగుతోందని, 10 సంవత్సరాల వ్యవధిలో ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఎనిమిదో సారి ప్రమాణ స్వీకారం చేయడం దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏదయినా ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ కొనసాగుతున్నారని, ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారనేది అంతుచిక్కట్లేదని వ్యాఖ్యానించారు.

నితీష్‌పై..

నితీష్‌పై..

ముఖ్యమంత్రి కుర్చీకి గ్లూ వేసుకుని అతుక్కుపోయిన నితీష్ కుమార్‌‌ను ఫెవికాల్‌ సంస్థ తన బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవచ్చని ప్రశాంత్ కిషోర్ ఎద్దేవా చేశారు. నితీష్ కుమార్ సారథ్యంలోని జనతాదళ్ (యునైటెడ్)-బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ప్రజల్లో సానుకూల అభిప్రాయం లేదని స్పష్టం చేశారు. 2024 నాటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నితీష్ కుమార్‌ను ప్రతిపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం లేదని, ఆయనలో నిలకడలేమి దీనికి కారణమని చెప్పారు.

జేడీయూ ఆగ్రహం..

జేడీయూ ఆగ్రహం..

ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు జేడీయూ నేతల్లో తీవ్ర అసహనాన్ని, ఆగ్రహాన్ని కలిగిస్తోన్నాయి. తాజాగా జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్ ఘాటు విమర్శలు చేశారు. ప్రశాంత్ కిషోర్ రాజకీయ నాయకుడు కాదని, పక్కా బిజినెస్‌మేన్‌ అని విమర్శించారు. ఆయన చేసిన విమర్శలు, ఆరోపణలన్నీ యూజ్‌లెస్ అని చురకలు అంటించారు. వ్యాపారవేత్త తరహాలోనే ఆయన సర్వేలు కూడా ఉంటాయని, ఎప్పుడెలా ప్రవర్తిస్తుంటాడో తెలియదని అన్నారు. ఇప్పుడు బీజేపీ కోసం పని చేస్తోన్నారని ఆరోపించారు.

 బిహార్ అభివృద్ధిలో..

బిహార్ అభివృద్ధిలో..


బిహార్ అభివృద్ధిలో ఎవరి వాటా ఎంత ఉందో.. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ చేసిన కృషి ఎంత అనేది అందరికీ తెలుసునని లలన్ సింగ్ అన్నారు. ప్రతిపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్ పనికి రాడని, ఆయన నమ్మదగ్గ నాయకుడు కాకపోవడమే దీనికి కారణమని ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలను లలన్ సింగ్ కొట్టిపారేశారు. ఎన్డీఏకు ప్రత్యామ్నాయంగా ప్రతిపక్ష పార్టీలను నితీష్ కుమార్ కూడగట్టే ప్రయత్నం చేస్తోన్నారని, ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, కేసీఆర్ వంటి నేతలను కలుస్తోన్నారని గుర్తు చేశారు.

English summary
The Janta Dal United President Lalan Singh took a dig at political strategist and politician Prashant Kishor by referring to him as a businessman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X