ప్రియురాలికి లేఖ రాసిన ప్రియుడు: బహిర్గతం చేసిన ట్రాయ్
న్యూఢిల్లీ: ఓ యువకుడు తన ప్రియురాలికి రాసిన లేఖ టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అధికారుల నిర్లక్ష్యం వల్ల బహిర్గతం అయింది. నెట్ న్యూట్రాలిటీ పైన అభిప్రాయాలు తెలపాలని ట్రాయ్ చేసిన విన్నపానికి లక్షలాది మంది ట్రాయ్‌కి మెయిల్స్ చేశారు. వాటిని ట్రాయ్ బయటపెట్టి విమర్శలపాలైంది.
అయితే, ఈ జాబితాలో ఓ ప్రియుడు తన ప్రియురాలికి పంపిన ప్రేమలేఖ ఉండటం గమనార్హం. ఈ లేఖ మనస్ఫూర్తిగా రాసినట్లుగా ఉంది. ఎంతో ఉత్కంఠతో ఉన్నట్లుగా ఉంది. తన గాఢమైన ప్రేమను తెలుపుతూ, ముద్దులు, మురిపాలు, సరసతను అందులో పొందుపర్చాడు.

ప్రియురాలికి రాసిన లేఖను అతను పొరపాటుగా ట్రాయ్‌కు పంపించాడని, దీనిని ట్రాయ్ బహిర్గతం చేయడం సరికాదని అంటున్నారు.
వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కల్గించారని ఆరోపిస్తున్నారు. ఇది కావాలనే చేశారో లేదా తెలియకుండా ప్రియురాలి బదులు ట్రాయ్‌కు వచ్చిందో తెలియదని అధికారులు చెబుతున్నారు. కాగా మంగళవారం నాడు ట్రాయ్ వెబ్ సైట్ డౌన్ అయింది.












Click it and Unblock the Notifications