వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శబరిమల భక్తులకు కొత్త గైడ్‌లైన్స్: 48 గంటల ముందు ఆర్టీ పీసీఆర్ టెస్ట్.. సడలింపు..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ నేపథ్యంలో కేరళ వైద్యారోగ్య శాఖ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. అయ్యప్ప స్వామిని దర్శించుకునే భక్తుల కోసం ఇప్పటికే గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు. అయితే వివిధ వర్గాల నుంచి వస్తోన్న వినతుల నేపథ్యంతో కొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు. నిళక్కల్ చేరే ముందు 48 గంటల ముందు కరోనా నెగిటివ్ రిపోర్ట్ చూపించాలని కోరారు. అదీ ఇదివరకు 24 గంటలు ఉండేది.. రోజు ముందు రిపోర్ట్.. అదీ కూడా స్వాబ్ టెస్ట్ కాకుండా.. ఆర్టీ పీసీఆర్/ ఆర్టీ ల్యాంప్/ ఎక్స్‌ప్రెస్ నాట్ టెస్ట్ చూపించడం వీలవడం లేదు. అందుకోసమే సమయాన్ని పెంచారు.

ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేస్తే 24 గంటల ముందు రిజల్ట్ రావడం వీలుకాదు. అందుకోసమే 48 గంటల సమయం ఇచ్చారు. దీంతో భక్తులకు వెసులుబాటు కలుగనుంది. ఈ కొత్త నిబంధనలు ఈ నెల 27వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. శబరిమల వద్ద విధులు నిర్వర్తించే సిబ్బందికి కూడా ఆర్టీ పీసీఆర్ పరీక్ష నిర్వహించడం తప్పనిసరి కానుంది. వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం.. 51 మంది భక్తులు, 245 మంది సిబ్బందికి శబరిమలలో కరోనా వైరస్ వచ్చింది. అయితే పరిస్థితి మరింత దిగజారకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Health advisory issued for Sabarimala pilgrims..

పతనంతిట్టలో వైరస్ 31 శాతం కేసులు కొత్తగా వస్తున్నాయి. కొట్టాయంలో 11 శాతం కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ఈ నెల 26వ తేదీన మండలపూజ జరగనుంది. ఆ తర్వాత కేసులు పెరుగుతాయని అంచనాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

English summary
kerala health department has once again amended its health advisory meant for Sabarimala pilgrimage. In the latest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X