Heat waves: ముందస్తుగా వీస్తున్న వడగాలులు- ప్రమాద ఘంటికలు-జాగ్రత్త..!
Heat waves in India:దేశంలో వడగాలులు పెరిగే అవకాశం ఉందని కేంద్ర వాతావరణశాఖ వెల్లడిస్తోంది. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులతో ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా పెరిగే అవకాశముందంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఢిల్లీ ముంబై, చెన్నై, కోల్‌కతాలాంటి ప్రధాన నగరాలతో పాటు మరికొన్ని నగరాల్లో మార్చి నెలలో మంచి వర్షాలు కురిశాయి. అయితే ఏప్రిల్ నెలలో మాత్రం ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఈ సారి చాలాముందుగానే వడగాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.
సాధారణంగా ఏప్రిల్-మే-జూన్ మాసాల్లో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకుంటాయి. ఆ తర్వాత కురిసే వర్షాలకు వాతావరణం క్రమంగా చల్లబడుతుంది.అయితే గత పదేళ్లలో చూస్తే వడగాలులు క్రమంగా పెరుగుతూ కొన్ని వందల మందిని పొట్టనబెట్టుకున్నాయి. గతేడాది ఉష్ణోగ్రతలు బీభత్సంగా పెరిగాయి. ఈ సారి మే నెలలో ఎండలు మామూలుగా ఉండవని శాస్త్రవేత్తలు వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వడగాలులు అని వాతావరణశాఖ ఎప్పుడు నిర్థారిస్తుంది..? సగటున సాధారణంగా నమోదయ్యే ఉష్ణోగ్రతలకంటే 4.5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదైతే వడగాలుల హెచ్చరికలు జారీ చేస్తారు.1992 తర్వాత భారత్‌లో 2015లో ఎక్కువగా వడగాలులు వీచాయి.ఆ సమయంలో 2081 మంది మృతి చెందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ వడగాలులు బారిన పడిన వారిలో ఎక్కువగా రిక్షావాలాలు, రోజువారీ కూలీ పనులు చేసుకునేవాళ్లు, రోడ్డు పక్కన చిరువ్యాపారులే ఉన్నారు.

ప్రస్తుతం భారత్‌లో ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నట్లు వాతావరణశాఖ అంచనా వేస్తోంది.మధ్య భారత్, ఉత్తర ద్వీపకల్ప భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతున్నాయని వివరించింది. వాయువ్య ప్రాంతాలు ద్వీపకల్ప ప్రాంతాలు మినహాయిస్తే ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశంలో చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువగా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని అంచనా వేస్తోంది.












Click it and Unblock the Notifications