Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అల్లకల్లోలం- కళ్లముందే అన్నీకొట్టుకుపోయాయి..!!

సిమ్లా: భారీ వర్షాలు ఉత్తరాది రాష్ట్రాలను అల్లకల్లోలానికి గురి చేస్తోన్నాయి. ఏకధాటిగా కురుస్తోన్న వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తోన్నాయి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్.. ఇలా ఉత్తరాదిలోని పలు రాష్ట్రాలు అతలాకుతలమౌతోన్నాయి. అక్కడి జనజీవనం అస్తవ్యస్తంగా తయారయింది.

 Heavy rain

చండీగఢ్‌లో రికార్డుస్థాయి వర్షపాతం నమోదైంది. ఈ ఉదయం 8:30 గంటల వరకు 322 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. 24 గంటల వ్యవధిలో ఈ స్థాయి వర్షం కురిసిందని పేర్కొంది. ఇది రికార్డ్. ఇప్పటివరకు చండీగఢ్‌లో 300 మిల్లీమీటర్లకు మించిన వర్షపాతం ఎప్పుడు పడలేదు. అంబాలాలో 224 మిల్లీమీటర్ష వర్షం కురిసింది.

 Heavy rain

అటు హిమాచల్ ప్రదేశ్‌ అతలాకుతలమౌతోంది. ప్రధాన నదులు ఉప్పొంగాయి. బియాస్, రావి నదులు మహోగ్రరూపాన్ని దాల్చాయి. ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోన్నాయి. బియాస్ మీద నిర్మించిన పండో రిజర్వాయర్‌లో నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరుకుంది. దీనితో అధికారులు అన్ని గేట్లను ఎత్తివేశారు. వరదనీటిని దిగువకు విడుదల చేశారు.

 Heavy rain

దీని ప్రభావం తీర ప్రాంతాలపై పడింది. బియాస్, రావి నదుల్లో వరద పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలు మునకేశాయి. అక్కడి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు అధికారులు. వరద నీటి ధాటికి బియాస్ నది పరీవాహక ప్రాంతం కోతకు గురైంది. కొన్ని నివాసాలు, భవన సముదాయాలు చూస్తుండగానే నదిలో పడిపోయాయి. ఒడ్డున పార్క్ చేసి ఉంచిన వాహనాలు కొట్టుకుపోయాయి.

ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పర్యాటకులెవరూ రావొద్దని హెచ్చరించింది. వర్షాల తీవ్రత తగ్గేంత వరకు రాష్ట్రంలోని కొన్ని పర్యాటక కేంద్రాలను మూసివేసినట్లు తెలిపింది. మూడు జాతీయ రహదారులతో సహా మొత్తం 736 రోడ్లల్లో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడినట్లు పేర్కొంది.

సిమ్లాలోని కోట్‌గఢ్‌లో ఈ తెల్లవారుజామున ముగ్గురు మృతి చెందారు. ఇల్లు కూలడంతో అందులో నివసిస్తోన్న వారుమృత్యువాత పడ్డారు. కొండచరియలు విరిగిపడటంతో ఇల్లు కూలిపోయినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మృతుల్లో భార్యాభర్తలు, ఓ చిన్నారి ఉన్నారు. సిమ్లా జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+