ప్రచారానికి విరామం: ఫేమస్ 56 దుకాణ్‌లో బాలుడికి ఐస్‌క్రీం తినిపించిన రాహుల్ గాంధీ
ఇండోర్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. మంగళవారం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఆయన కాసేపు తన ప్రచారానికి విరామం ఇచ్చారు. అక్కడి ఫేమస్ 56 దుకాణ్‌లో ఐస్ క్రీం తినేందుకు వచ్చారు.
రాహుల్ గాంధీ కోసం ఆ దుకాణం సిబ్బంది ప్రత్యేకంగా ఐస్ క్రీం తయారు చేసి ఇచ్చారు. దానిని తీసుకున్న రాహుల్ గాంధీ అక్కడే ఓ బాలుడు ఉండటాన్ని గమనించాడు.

హలో.. ఐస్ క్రీం తింటావా అని ప్రశ్నించాడు. అంతేకాదు, అతనికి ఐస్ క్రీం కూడా తినిపించాడు. కాగా రాహుల్ గాంధీ వెంట కాంగ్రెస్ నేతలు కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సిందియా తదితరులు ఉన్నారు.












Click it and Unblock the Notifications