హలో యాప్ ఔదార్యం : కరోనాపై పోరులో 20వేల కుటుంబాలకు సాయం..
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో పేదలు,నిరాశ్రయులకు ఆహారం,శానిటైజర్స్ అందించేందుకు సోషల్ నెట్‌వర్కింగ్ సంస్థ హలో స్వచ్చందంగా ముందుకొచ్చింది. గివ్ ఇండియా అనే ఎన్జీవోతో కలిసి ##MainBhiCOVIDWarrior అనే క్యాంపెయిన్‌ను మొదలుపెట్టింది. ఇందుకోసం రూ.5 కోట్లు వెచ్చించనున్న హలో... దీని ద్వారా 20వేల పేద కుటుంబాలకు సాయం అందించనుంది. నెలకు సరిపడా నిత్యావసరాలతో పాటు శానిటైజర్స్ అందించనుంది.
అంతకుముందు Jjust music,కేప్ గుడ్ ఫిలింస్‌తో చేతులు కలిపి కరోనాపై పోరు కోసం 'ముస్కురాయేగా ఇండియా' అనే ప్రత్యేక వీడియో ఆల్బమ్‌ను రూపొందించింది. బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్,టైగర్ ష్రాఫ్,కృతీ సనన్,కార్తీక్ ఆర్యన్,తాప్సీ పన్ను,కియారా అద్వానీ,అనన్య పాండే,క్రికెటర్ శిఖర్ ధావన్ తదితరులు ఇందులో నటించారు.

వీటితో పాటు మరో రూ.2కోట్లు ఆర్థిక సాయాన్ని కూడా హలో అందజేసింది. ఈ డబ్బులను పీఎం కేర్స్,మహారాష్ట్ర సీఎం ఫండ్స్‌కు ట్రాన్స్‌ఫర్ చేసింది. హలో మొదలుపెట్టిన గివ్ ఇండియా క్యాంపెయిన్‌కు శిల్పాశెట్టి వంటి నటీమణులు కూడా తమవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. పేద వర్గాలను ఆదుకునేందుకు ముందుకొచ్చేవారు ఈ క్యాంపెయిన్‌లో భాగం కావాలని పిలుపునిస్తున్నారు. అలాగే కరోనాపై సమాచారం కోసం హలో #FightAgainstCoronavirus ప్రత్యేక పేజీ ద్వారా ఎప్పటికప్పుడు 14 భాషల్లో అప్‌డేట్స్ అందిస్తోంది.












Click it and Unblock the Notifications