• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తొమ్మిదేళ్ల బాలికను కాపాడే మహత్తర కార్యక్రమం..మన చేతుల్లో: చేయాల్సింది అదొక్కటే

ఇదో కుటుంబం దీన గాథ. పశ్చిమ బెంగాల్‌లోని బకురా సమీపంలో గల కృష్ణానగర్‌లో నివాసం ఉంటోన్న ఉత్తమ్ రాయ్ దంపతుల కుమార్తె దిశ. ఆమె వయస్సు తొమ్మిది సంవత్సరాలు. ఉత్తమ్ రాయ్‌ది పేద కుటుంబం. కూరగాయలను అమ్ముకుని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం వారిది. కూరగాయలను విక్రయించడం ద్వారా మిగిలే డబ్బులే వారికి జీవనాధారం. అలా వచ్చిన డబ్బులతోనే వారి కుటుంబం గడిచేది.

ఒకరోజు దిశ.. ఎప్పట్లాగే తాను చదివే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు వెళ్లింది. చదువుకోవాలనే తపన ఆమెలో కనిపించేది. తీవ్ర అనారోగ్యం బారిన పడినప్పటికీ.. చదువు కోవాలనే పట్టుదలను ఆమెను రోజూ స్కూల్ వైపు నడిపిస్తుండేది. టీదర్డ్ కార్డ్ సిండ్రోమ్‌తో కూడిన కాంజెనిటల్ స్కోలియోసిస్ (congenital scoliosis with tethered cord syndrome)తో దిశ బాధపడుతున్నట్లు ఆ స్కూల్ హెడ్‌మాస్టర్ గుర్తించాడు. వెంటనే- ఉత్తమ్ రాయ్ దంపతులను స్కూల్‌కు పిలిపించాడు.

Help 9 year old West Bengals Disha recover from congenital scoliosis with tethered cord syndrome

దిశ చదువులో అత్యంత ప్రతిభావంతురాలని, ఆమెకు బంగారు భవిష్యత్తు ఉందని హెడ్‌మాస్టర్ వారికి వివరించారు. ఆమెకు వైద్య చికిత్సను చేయించాలని చెప్పారు. చెన్నైలోని మియోట్ ఆసుపత్రిలో దిశకు చికిత్స చేయించాలని సూచించారు. చెన్నై మియోట్ ఆసుపత్రిలో దిశకు వైద్య చికిత్స చేయించడం ద్వారా ఆ బాలిక పూర్తిగా కోలుకుంటుందని వివరించారు. పశ్చిమ బెంగాల్ నుంచి చెన్నైకి వెళ్లడానికి అవసరమైన ఛార్జీల డబ్బులు కూడా ఉత్తమ్ రాయ్ వద్ద లేవు. దీన్ని గమనించిన హెడ్‌మాస్టర్ ఉత్తమ్ రాయ్ దంపతులకు తనవంతు ఆర్థిక సహాయం చేశారు. దీనితో వారు మియోట్ ఆసుపత్రికి చేరుకున్నారు.

Help 9 year old West Bengals Disha recover from congenital scoliosis with tethered cord syndrome

దిశకు మియోట్ ఆసుపత్రి డాక్టర్లు వైద్య పరీక్షలను నిర్వహించారు. కనీసం నాలుగు దశల్లో సర్జరీ చేయాల్సి ఉంటుందని ఉత్తమ్‌ రాయ్ దంపతులకు వివరించారు. దీనితోపాటు తరచూ వైద్య పరీక్షలను జరపాల్సి ఉంటుందని అన్నారు. టీదర్డ్ కార్డ్ సిండ్రోమ్‌తో కూడిన కాంజెనిటల్ స్కోలియోసిస్‌తో దిశ బాధపడుతోందని గుర్తించారు. ఆమెకు- పోస్టేరియర్ స్టెబిలైజేషన్ విత్ గ్రోవింగ్ రాడ్స్ ఫర్ డెఫర్మిటీ కర్రెక్షన్ చేయడం ద్వారా ఆరోగ్యవంతురాలవుతుందని తెలిపారు.

Help 9 year old West Bengals Disha recover from congenital scoliosis with tethered cord syndrome

దీనికోసం అయ్యే ఖర్చు 4,50,000 రూపాయలు అవుతుందని మియోట్ హాస్పిటల్ డాక్టర్లు నిర్ధారించారు. సర్జరీ, ఐసీయు అండ్ హాస్పిటల్ స్టే, ఆపరేషన్ తరువాత చేపట్టే ఆరోగ్యపరమైన పరీక్షలు, మెడికేషన్స్‌తో కలిపి 4,50,000 రూపాయలు అవుతుందని స్పష్టం చేశారు. విషాదకరమైన విషయం ఏమిటంటే- చెన్నై నుంచి పశ్చిమ బెంగాల్‌లోని తమ సొంత గ్రామానికి వెళ్లడానికి కూడా డబ్బులు లేని కుటుంబం ఉత్తమ్ రాయ్‌ది.

Help 9 year old West Bengals Disha recover from congenital scoliosis with tethered cord syndrome

తన కుమార్తె సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలంటే దాతలు దయవుంచి విరాళాలు ఇవ్వాలని ఆయన ప్రాధేయపడుతున్నారు. దాతల కోసం ఎదురు చూస్తున్నారు. ఉత్తమ్ రాయ్ కుమార్తె దిశకు విరాళం రూపంలో సహాయం చేయాలనుకునేవారు వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. గూగుల్ పే, ఫోన్ పే, వాట్సాప్ పే, అమెజాన్ పే ఇలా డిజిటల్ పేమెంట్ ద్వారా కూడా డబ్బులు విరాళంగా ఇవ్వొచ్చు. దిశను కాపాడే బాధ్యతను తీసుకుందాం. తిరిగి చిరునవ్వుతో ఇంటికి చేరడానికి మానవత్వంతో మనవంతు సహాయం చేద్దాం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X