కిరాతకం: రంపంతో భార్యను కోసిన భర్త, రక్షించకుండా వీడియో తీశారు

భర్త చేతిలో గాయపడి చావుబతుకుల మధ్య సంజూ అనే మహిళ రక్షించండి అంటూ ప్రాధేయపడినా ఎవరూ కనికరించలేదుఆమె ప్రాధేయపడుతున్న దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీస్తూ కన్పించాడు.పోలీసులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు.

జింద్: మానవత్వం మంటగలిసింది. ఆధునిక పోకడలు వచ్చిన తర్వాత మనిషిలో మానవత్వపు జాడలు మచ్చుకైనా కన్పించడం లేదు.ఈ తరహ ఘటనల గురించి వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. ఇదే తరహ ఘటన ఒకటి తాజాగా మరోకటి వెలుగుచూసింది. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో చోటుచేసుకొంది.

భర్త చేతిలో తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో కొట్టుకొంటూ రక్షించండంటూ అరుస్తున్నా చుట్టపక్కల వారు ఆమెకు సహయం చేయకుండా తమ మొబైలో ఫోన్ లలో వీడియోలు తీసుకొంటూ ఉండిపోయారు.

Help Me, Begged Woman Slashed With Axe By Husband. Neighbours Filmed Her

ఆమె కన్నబిడ్డలు చుట్టూ చేరి రోధిస్తున్నా ఒక్కరూ కూడ కనికరించలేదు. ఈ దయనీయ ఘటన హర్యానాలోని జింద్ లో చోటచేసుకొంది. మరోలి అనే గ్రామంలో సంజూ అనే మహిళ ఈ భర్త చేతిలో తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోంది.

సంజూ ను ఆమె భర్త నరేష్ నిత్యం వేధించేవాడు. ప్రతిరోజూను ఆమెను హింసించేవాడు. దీంతో ఆమె భర్తపై కేసు పెట్టింది. శుక్రవారం సాయంత్రం బయటకు వెళ్ళిన సంజూ ఇంటికి రాగానే భర్త నరేష్ ఆమె కళ్ళలో కారం కొట్టాడు.

రంపంతో ఆమె భుజంపై, కడుపులో మోకాలిపై దాడి చేశారు. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావమైంది. ఇంటిముందు నడివీధిలో పడిపోయింది. తాను చనిపోతున్నానని రక్షించాలని ప్రాధేయపడినా ఎవరూ కూడ రక్షించే ప్రయత్నం చేయలేదు.

అయితే ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు అక్కడికి రాగానే ఓ వ్యక్తి ఈ తతంగాన్ని వీడియో తీస్తూ కన్పించాడు. ఆ వ్యక్తిని గట్టిగా మందలించారు. పోలీసులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించాడు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సంజూ భర్త నరేష్ ను అరెస్టుచేశారు పోలీసులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+