ఇల్లు కొంటున్నా, అప్పుడు తెలియదు: హేమమాలిని

 Hema Malini: Deal of buying a house in Mathura almost in final stage
లక్నో: లోకసభ ఎన్నికల అనంతరం తాను మధుర నియోజకవర్గాన్న వీడి వెళ్లనున్నట్లు వస్తున్న వార్తలను భారతీయ జనతా పార్టీ ఆ నియోజకవర్గం అభ్యర్థి, సినీ నటి హేమమాలిని ఖండించారు. తాను మధురలోనే ఉంటానని ఆమె స్పష్టం చేశారు. తాను మధుర నియోజకవర్గంలో ఇంటిని కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉన్నానని తెలిపారు.

శ్రీకృష్ణుడిని అమితంగా ఆరాధించే తాను ముందుముందు ఇక్కడే ఉండి ఈ పుణ్యభూమికి సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నానని ఆమె అన్నారు. కృష్ణ భగవానుడు నడయాడిన మధుర, యమున ప్రస్తుతం అత్యంత దుర్భర స్థితిలో ఉన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

వీటికి మళ్లీ పూర్వవైభవాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు. మధుర దుర్భర స్థితిలో ఉందని, యమునా నది నీరు కలుషితమవడంతో తాగునీటి సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నారని, అలాగే ఇక్కడ రోడ్లు, విద్యుత్ సరఫరా వ్యవస్థ అస్తవ్యస్థంగా తయారయ్యాయని, ఈ సమస్యలన్నింటి నుంచి మధురను గట్టెక్కించాలని ఎదురుచూస్తున్నాని అన్నారు.

రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నందున తాను ఈ నియోజకవర్గం సమస్యలను తెలుసుకోలేకపోయానని చెప్పారు. ఇప్పుడు లోకసభలో పోటీ చేస్తున్నందున అంతటా తిరిగి... జిల్లా యొక్క సమస్యలను తెలుసుకున్నానని చెప్పారు. మధురను తీర్థస్థలంగా ప్రకటించేందుకు కృషి చేస్తానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+