వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హేమమాలిని వ్యాఖ్యల దుమారం, స్థానికుల సమర్థన

By Srinivas
|
Google Oneindia TeluguNews

లక్నో: భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యురాలు, ప్రముఖ బాలీవుడ్ నటి హేమమాలిని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

బృందావనంలో నివసిస్తున్న వితంతు మహిళల పట్ల ఆమె ఇటీవల వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యల పైన పలువురు మండిపడుతున్నారు.

బృందావనంలోని షెల్టర్ హోంలలో బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వితంతువులు ఉండటాన్ని హేమమాలిని ప్రశ్నించారు.

హేమమాలిని

హేమమాలిని

పవిత్రమైన బృందావనంలోని షెల్టర్ హోంలలో పలువురు వింతంతు మహిళలు ఉంటుంటారు. ఇందులో పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు.

 హేమమాలిని

హేమమాలిని

తాను ఈ విషయమై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మాట్లాడుతానని బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి అయిన హేమమాలిని అన్నారు.

హేమమాలిని

హేమమాలిని

ఆసక్తికరమైన విషయమేమంటే బాలీవుడ్ నటి, ఎంపీ హేమమాలిని వ్యాఖ్యలను స్థానికులు చాలామంది సమర్థిస్తున్నారని తెలుస్తోంది.

 హేమమాలిని

హేమమాలిని

ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారికి దారి చూపించాలని, వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, చాలామంది ప్రభుత్వాల నుండి పించన్లు కూడా తీసుకుంటున్నారని, అలాంటప్పుడు ఇక్కడకు రావాల్సిన అవసరమేమిటని కొందరు ప్రశ్నిస్తున్నారట.

 హేమమాలిని

హేమమాలిని

హేమమాలిని వ్యాఖ్యల పైన కాంగ్రెస్ పార్టీ నేత శోభా ఓఝా మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ సమాజాన్ని విభజించే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.

హేమమాలిని

హేమమాలిని

ఇదిలా ఉండగా, సులభ్ ఇంటర్నేషనల్ ప్రతినిధిలు మాట్లాడుతూ.. ఈ వివాదంతో సంబంధం లేకుండా తాము పని చేస్తామని, కోర్టు ఆదేశాల మేరకు తాము సౌకర్యాలు సమకూరుస్తున్నామని, ఉండేవారు ఉండవచ్చునని, వెళ్లేవారు వెళ్లవచ్చునని, ఇది తమకు సంబంధించిన విషయం కాదని చెబుతున్నారు.

English summary
Actor-turned-politician Hema Malini is facing criticism for her recent comments on the widows living in Vrindavan.​
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X