సంగ్మా తనయ నుంచి ముకుల్ సంగ్మా సతీమణి వరకూ.. అంతా కోటీశ్వరులే

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

షిల్లాంగ్: మేఘాలయ అసెంబ్లీకి ఈ నెల 27న ఎన్నికలు జరుగనున్నాయి.ఈ ఎన్నికల్లో సీఎం ముకుల్ సంగ్మా సారథ్యంలోని కాంగ్రెస్, లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా తనయుడు కన్రడ్ సంగ్మా ఆధ్వర్యంలోని నేషనలిస్టు పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) - బీజేపీ సంయుక్తంగా పోటీ చేస్తున్నాయి. అందునా కాంగ్రెస్ ముక్త రహిత భారతదేశాన్ని ఆవిష్కరించాలన్నది ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కల. కాంగ్రెస్, ఎన్పీపీ - బీజేపీ మధ్య ముఖాముఖీ జరుగుతున్న ఈ ఎన్నికల్లో పీఏ సంగ్మా తనయ అగథా సంగ్మా, సీఎం ముకుల్ సంగ్మా సతీమణి దిక్కాంచి డీ షిరా కూడా పోటీ చేస్తున్నారు. అంతే కాదు రాష్ట్రంలోని సంపన్నుల్లో భాగస్వాములు కావడం విశేషం.
దాని సంగతి అలా పక్కన బెడితే ఈశాన్య భారత రాష్ట్రాల్లోని మేఘాలయలో 11 మంది మహిళలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఉమ్రోయి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి నైట్ లాంగ్ ధర్ అత్యంత సంపన్నుడు. ఆయన ఇంట్లో 140కి పైగా వాహనాలు ఉన్నాయంటే వాస్తవ పరిస్థితేమిటో అర్థమవుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన నైట్‌లాంగ్‌ధర్ తాజాగా నేషనలిస్టు పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) నుంచి పోటీ చేస్తున్నారు.

మహేంద్రగంజ్ నుంచి బరిలో ముకుల్ సంగ్మా సతీమణి

మహేంద్రగంజ్ నుంచి బరిలో ముకుల్ సంగ్మా సతీమణి

సిట్టింగ్ కాంగ్రెస్ సభ్యురాలు దేబోరా సీ మరాక్ తిరిగి విలియం నగర్ అసెంబ్లీ స్థానం నుంచి మరోసారి తన అద్రుష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అక్షరాల ఆమె ఆస్తుల విలువ మొత్తం రూ.12.343 కోట్లు అంటే అతిశయోక్తి కాదు. కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం చరాస్థుల విలువ రూ.1,03,98,237.15, చిరాస్థుల విలువ రూ.11.304 కోట్లు ఉంటుంది. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే డేబోరా మరాక్ ఆస్తుల విలువ రూ.5.78 కోట్లు పెరుగుతుంది. 2013లో చరాస్తుల విలువ రూ.1,05,01,609 కోట్లు ఉంటే, చిరాస్తుల విలువ రూ.4.73 కోట్లన అఫిడవిట్ పేర్కొంది.
మేఘాలయ సీఎం డాక్టర్ ముకుల్ సంగ్మా భార్య దిక్కాంచి డీ షిరా ఎన్నికల్లో పోటీ చేస్తున్న కోటీశ్వరురాలు. మహేంద్రగంజ్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన దిక్కాంచీ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం మొత్తం ఆస్తుల విలువ రూ.10,20,27, 481.56. అదే ఆస్థులు 2013లో 6,35,90,889 ఉన్నాయి.

ఎన్పీపీ నుంచి హవెర్గెల్ ఎడ్వినా

ఎన్పీపీ నుంచి హవెర్గెల్ ఎడ్వినా

రాణికోర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి పెల్సీ స్నయిటాంగ్.. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మార్టిన్ ఎం డాంగోకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మార్టిన్ ఎం డాంగ్గో సంపన్న అభ్యర్థి విలువ 9,17,72,001 కోట్లు ఉంటే, 2013లో దాని విలువ రూ.2,51,34, 198 ఉన్నదని ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. పీడీఎఫ్ అభ్యర్థిగా గ్రేస్ మేరి ఖార్పూరి పోటీ చేస్తున్నారు. ఎన్పీపీ తరఫున పోటీ చేస్తున్న ప్రిస్టోన్ త్యాన్‌సాంగ్ 2018లో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆమె ఆస్తుల విలువ రూ.6,88,56,455 కాగా.. అంతకుముందు 2013లో దాని విలువ రూ.1,14,58,566 మాత్రమే. నార్టియాంగ్ నుంచి ఎన్పీపీ తరఫున హవెర్గైల్ ఎడ్వినా బారేహ్ పోటీలో ఉన్నారు. ఆమె తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆమె ఆస్తి విలువ రూ.5.31,41,149. పోటీలో ఉన్న ఐదో సంపన్నురాలు. ఎడ్వినా బారెహ్ మాదిరిగానే ఎవాల్యీనీ ఖర్బానీ స్వతంత్ర్య అభ్యర్థిగా మావ్హాటీ స్థానం నుంచి తొలిసారి పోటీ చేస్తున్నారు. ఆమె ఆస్తి విలువ రూ.3,83,85,808గా నమోదైంది.

దక్షిణ తురా స్థానం నుంచి మాజీ మంత్రి అగాథా సంగ్మా

దక్షిణ తురా స్థానం నుంచి మాజీ మంత్రి అగాథా సంగ్మా

నాంగ్పోహ్ స్థానం నుంచి పోటీలో ఉన్న మరో అభ్యర్థి మారియన్ మారింగ్ బీజేపీ తరఫున తొలిసారి నామినేషన్ దాఖలు చేశారు. నాంగ్ఫోహ్ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. మారియన్ మారింగ్ ఏడో సంపన్నురాలు. ఆమె ఆస్తుల విలువ రూ.3,63,85,000 అని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా కూతురు, మాజీ ఎంపీ అగథా కే శర్మ (ఎన్పీపీ) దక్షిణ తురా స్థానం నుంచి పోటీలో ఉన్నారు. ఇప్పటికే ఎంపీ కన్రడ్ సంగ్మాకు ఆమె సోదరి. కన్రడ్ సంగ్మా ఎన్పీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. అగథా సంగ్మా ఆస్తుల విలువ 2,86,61,306 కోట్లు అని తేలింది.
ఈస్ట్ షిల్లాంగ్ నుంచి పోటీ చేస్తున్న మాజెల్ అంపారిన్ లింగ్డో.. ఐదేళ్ల క్రితం లక్షాధికారిగా ఉన్నారు. నాటి నుంచి ఇప్పటివరకు కేవలం రూ.21,70,362 విలువైన ఆస్తులు రూ.1,75,47,349కి చేరుకున్నాయని తాజా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. డాడేంగరీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన జూన్ ఎలియానా ఆర్ మరాక్.. మాజీ మంత్రి క్లెమెంట్ మరాక్ భార్య. ఆమె ఆస్తి విలువ రూ.1,62,21,888 అని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
If NPP candidate from Umroi constituency, Ngaitlang Dhar is the richest candidate in the fray for the Assembly election in Meghalaya due on February 27, then sitting Congress legislator Deborah C Marak from Williamnagar constituency is the richest woman candidate in the poll fray with a total asset of Rs 12.343 crore.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి