• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 50 కలలు.. భౌతిక శాస్త్ర ప్రయోగాలు, విశ్వం, ప్రకృతి గురించి కన్న కలల్లో నెరవేరనివి ఎన్నంటే..

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మై డ్రీమ్స్ 50 అండ్ కౌంటింగ్

ప్రముఖ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇక లేరు. ఆదివారం ముంబయి బాంద్రాలోని తన నివాసంలో ఆయన చనిపోయారు.

34 ఏళ్ల సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నారని ముంబయి పోలీసులు తెలిపారు. అయితే, ఈ ఆత్మహత్యకు కారణాలేంటి అనేది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియలేదు. గత ఆరు నెలలుగా ఆయన డిప్రెషన్‌తో బాధపడుతున్నారని కూడా తెలుస్తోంది.

సుశాంత్ సింగ్ చనిపోయారన్న వార్త తెలియగానే ఆయన అభిమానులు సోషల్ మీడియాలో దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. బాలీవుడ్‌లో క్రమక్రమంగా ఎదుగుతూ, తనకంటూ మంచి పేరు తెచ్చుకున్న ఒక యువ నటుడు ఇలా ఉన్నట్టుండి చనిపోవడం పట్ల అంతా షాకయ్యారు.

టీవీ సీరియల్స్ ద్వారా నట ప్రస్థానాన్ని ప్రారంభించిన సుశాంత్ సింగ్‌కు చాలా కలలు ఉన్నాయి. ఆ కలలే ఆయన్ను బాలీవుడ్‌కి చేర్చాయి.

కై పో చే, డిటెక్టివ్ బ్యోమ్‌కేష్ భక్షి, ధోనీ, పీకే, కేదార్‌నాథ్, చిచ్చోరే వంటి చిత్రాలు ఆయనకు పేరుతెచ్చిపెట్టాయి.

సినిమాలకు సంబంధించి సుశాంత్ సింగ్ కలలు క్రమంగా నెరవేరుతూ వచ్చాయి. కానీ, ఇంకా నెరవేరని కలలు చాలా ఉన్నాయి.

ట్విటర్ వేదికగా తన కలలను ఆయన అందరితో పంచుకున్నారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2019 సెప్టెంబర్ 14వ తేదీన 'My 50 DREAMS & counting' పేరుతో మొదటి పేజీ ఫొటోను పెట్టారు.

https://twitter.com/itsSSR/status/1172733918417604608

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మొదటి కల ఒక విమానాన్ని నడపడం నేర్చుకోవడం.

రెండో కల ఐరన్ మ్యాన్ ట్రయథ్లాన్‌కు సిద్ధం కావడం. ఇందులో ఒక వ్యక్తి ఒక్క రోజులోనే 2.4 మైళ్లు స్విమ్మింగ్, 112 మైళ్లు సైకిల్ రైడింగ్, 26.22 మైళ్లు పరుగుపందెంలో పాల్గొనాల్సి ఉంటుంది. మూడు పందేలకూ నిర్ణీత సమయం ఉంటుంది. ఈ మూడింటిలో గెలుపొందిన వారికి ఐరన్ మ్యాన్ టైటిల్ ఇస్తారు.

సుశాంత్ సింగ్ మూడో కల ఎడమ చేతితో క్రికెట్ మ్యాచ్ ఆడటం. ఎంఎస్ ధోనీ చిత్రంలో ఆయన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, వికెట్ కీపర్, కుడి చేతి వాటం బ్యాట్స్‌మెన్ అయిన మహేంద్ర సింగ్ ధోనీగా నటించిన సంగతి తెలిసిందే.

నాలుగో కల మోర్సె కోడ్‌ నేర్చుకోవడం. ఈ కోడ్‌ను టెలీకమ్యూనికేషన్ కోసం ఉపయోగిస్తుంటారు. దీని సాయంతో పదాలను రెండు భిన్నమైన సిగ్నళ్లుగా ఎన్‌కోడ్ చేస్తారు. వీటిని డాట్లు లేదా డాష్‌లు అంటారు.

ఐదో కల చిన్నారులు అంతరిక్షం గురించి తెలుసుకునేందుకు సహాయం చేయడం.

ఒక క్రికెట్ ఛాంపియన్ పాత్రలో నటించిన సుశాంత్ సింగ్ ఆరోకల ఒక టెన్నిస్ ఛాంపియన్‌ పాత్రలో నటించడం.

సుశాంత్ సింగ్ సోషల్ మీడియాలో చాలా ఫిట్‌నెస్ వీడియోలు కనిపిస్తుంటాయి. ఆయన ఏడో కల కూడా దీనికి సంబంధించినదే. నాలుగు క్లాప్ పుషప్‌లు చేయడం.

ఈ ఏడు కలలతో మొదటి పేజీ పూర్తయ్యింది. కానీ, ఆయన కలలు రెండో పేజీలో కొనసాగాయి.

https://twitter.com/itsSSR/status/1172751475463708673

రెండో పేజీ..

సుశాంత్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అంతరిక్షం గురించి, విశ్వం గురించి తన అభిప్రాయాలు పంచుకునేవారు. తన నటనతోను, చిరునవ్వుతోనూ గుర్తింపు తెచ్చుకున్న ఆయన కలల గురించి తెలుసుకుంటే అంతరిక్షం, గ్రహాలపై ఆయనకు ఎంత ఆసక్తి ఉందో తెలుస్తుంది.

సుశాంత్ సింగ్ ఎనిమిదో కల.. ఒక వారం రోజుల పాటు చంద్రుడు, అంగాకరుడు, బృహస్పతి, శని గ్రహాలను పర్యవేక్షించడం.

తొమ్మిదో కల ఒక బ్లూ హోల్‌లో ఈత కొట్టడం. సముద్రాల్లోని దీవుల్లో నీలం రంగులో ఉండే గుహలను బ్లూహోల్ అంటారు.

పదో కల.. ఒకసారి డబుల్ స్లిట్‌ ప్రయోగం చేసేందుకు ప్రయత్నించడం. కాంతి, పదార్థాలను వివరించేదే ఈ భౌతిక శాస్త్ర ప్రయోగం.

సుశాంత్ సింగ్ కొన్ని వేల మొక్కలు నాటాలని అనుకున్నాడు. అదే అతని 11వ కల.

సుశాంత్ సింగ్ 2003వ సంవత్సరంలో 12వ తరగతిలో ఉత్తీర్ణుడయ్యారు. ఆ తర్వాతి సంవత్సరం ఏఐఈఈఈ పరీక్ష రాసి ఆలిండియా 7వ ర్యాంకు సంపాదించారు. దాంతో దేశంలో అత్యుత్తమ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటైన దిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో చేరారు. ఆ కాలేజీని సందర్శించడం సుశాంత్ సింగ్ 12వ కల.

ఇస్రో లేదా నాసా వర్క్‌షాపుకు వంద మంది పిల్లల్ని పంపించడం అతని 13వ కల.

కైలాశ్‌ (పర్వతం)పై ధ్యానం చేయడం సుశాంత్ సింగ్ 14వ కల. ఆయన కేదార్‌నాథ్ సినిమాలో నటించిన నేపథ్యంలో బహుశా ఈ కల నెరవేరి ఉండొచ్చు.

https://twitter.com/itsSSR/status/1172753250375757829

మూడో పేజీ..

ఒక ఛాంపియన్‌తో పోకర్ (పేకాట) ఆడటం 15వ కల

ఒక పుస్తకం రాయడం 16వ కల

యురోపియన్ న్యూక్లియర్ రీసెర్చి సంస్థ అయిన సీఈఆర్ఎన్‌ను సందర్శించడం 17వ కల

పోలార్ లైట్స్, నార్తరన్ లైట్స్, సదరన్ లైట్స్‌గా పేరొందిన ఆరోరాను చూస్తూ పెయింటింగ్ వేయడం 18వ కల

నాసాలో మరొక వర్క్‌షాపుకు హాజరు కావడం 19వ కల

ఆరు నెలల్లోనే సిక్స్ ప్యాక్స్ శరీరాన్ని పొందడం 20వ కల

సెనోట్ (సున్నపురాయి భూమి కుంగిపోవడంతో సహజంగా ఏర్పడిన నీటి కొలను)లో ఈదడం 21వ కల

చూపులేని వారికి కోడింగ్ నేర్పించడం 22వ కల

అడవిలో ఒక వారం రోజుల పాటు గడపడం 23వ కల

వైదిక జ్యోతిష్య శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం 24వ కల

డిస్నీలాండ్‌కి వెళ్లడం 25వ కల

https://twitter.com/itsSSR/status/1172804669690847234/photo/1

నాలుగో పేజీ..

అమెరికాలోని లిగో (లేజర్ ఇంటర్‌ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ)ని సందర్శించడం 26వ కల. ఇక్కడ భౌతిక శాస్త్ర ప్రయోగాలు జరుగుతుంటాయి.

ఒక గుర్రాన్ని పెంచుకోవడం 27వ కల

కనీసం పది నాట్య రీతుల్ని నేర్చుకోవడం 28వ కల

ఉచిత విద్య కోసం పనిచేయడం 29వ కల. సుశాంత్ ఫర్ ఎడ్యుకేషన్ పేరిట ఆయన విద్యార్థులకు సహాయం కూడా చేసేవారు.

అండ్రొమేడా అనే పాలపుంతను ఒక శక్తివంతమైన టెలిస్కోప్ సాయంతో పరిశీలించడం 30వ కల

క్రియా యోగను నేర్చుకోవడం 31వ కల

మంచుతో నిండిపోయిన అంటార్కిటికా ఖండాన్ని సందర్శించడం 32వ కల

మహిళలు స్వీయ రక్షణ నైపుణ్యాలు నేర్చుకునేలా సహాయం చేయడం 33వ కల

నిప్పులు చిందే ఒక అగ్నిపర్వతాన్ని చిత్రీకరించడం 34వ కల

https://twitter.com/itsSSR/status/1172805034138054656/photo/1

ఐదో పేజీ..

వ్యవసాయం నేర్చుకోవడం సుశాంత్ సింగ్ 35వ కల

పిల్లలకు డాన్స్ నేర్పించడం 36వ కల

రెండు చేతులతో బాణాలు వేసేలా శిక్షణ పొందాలని సుశాంత్ సింగ్ భావించారు. అదే అతని 37వ కల

రెస్నిక్ హల్లిడే రచించిన ఫిజిక్స్ పుస్తకం మొత్తాన్ని చదవాలనుకోవడం అతని 38వ కల

పాలినేసియన్ ఆస్ట్రానమీని అర్థం చేసుకోవడం సుశాంత్ సింగ్ 39వ కల

తన ఫేవరెట్ 50 పాటలకు గిటార్ నేర్చుకోవడం 40వ కల

ఒక ఛాంపియన్‌తో చెస్ ఆడటం 41వ కల

లాంబోర్గిని కారును సొంతం చేసుకోవడం 42వ కల

https://twitter.com/itsSSR/status/1172806176670724096/photo/1

ఆరో పేజీ..

వియన్నాలోని సెయింట్ స్టీఫెన్స్ కేథడ్రల్ చర్చిని సందర్శించడం 43వ కల

సైమాటిక్స్ ప్రయోగాలు (ప్రకంపనలకు సంబంధించిన ప్రయోగాలు) చేయడం 44వ కల

భారత సైన్యంలో చేరేలా విద్యార్థులు సిద్ధమయ్యేందుకు సహాయం చేయడం 45వ కల

సముద్ర అలలపై సర్ఫింగ్ చేయడం 47వ కల

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎక్స్‌పోనేషియల్ టెక్నాలజీలపై పని చేయడం 48వ కల

కపోరియా (ఆఫ్రో-బ్రెజిలియన్ మార్షల్ ఆర్ట్)ను నేర్చుకోవడం 49వ కల

యూరప్ మొత్తం రైలులో ప్రయాణించడం 50వ కల

అయితే, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేవలం కలలు కనడం, వాటిని బయటపెట్టడంతోనే ఆగిపోలేదు. వాటిలో కొన్నింటిని పూర్తి చేశారు కూడా.

మొదటి కల నిజమైంది ఇలా..

https://twitter.com/itsSSR/status/1177153151234764800

రెండో కల

https://twitter.com/itsSSR/status/1181915801835540480

మూడో కల

https://twitter.com/itsSSR/status/1182175409548464128

17వ కల

https://twitter.com/itsSSR/status/1176736414391603200

37వ కల

https://twitter.com/itsSSR/status/1177579248938151937

21వ కల

https://twitter.com/itsSSR/status/1177956930301480962

12వ కల

https://twitter.com/itsSSR/status/1178299507479474177

30వ కల

https://twitter.com/itsSSR/status/1180057436557889536

9వ కల

https://twitter.com/itsSSR/status/1181105596155731968

25వ కల

https://twitter.com/itsSSR/status/1181594589158891521

44వ కల

https://twitter.com/itsSSR/status/1182334197756780544

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ట్విటర్ ఖాతా

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ట్విటర్ ఖాతాలో తనను తాను 'ఫోటాన్ ఇన్ ఎ డబుల్ స్లిట్’ అని నిర్వచించుకున్నారు. కాంతి, పదార్థాలను వివరించేదే భౌతిక శాస్త్ర ప్రయోగాన్ని డబుల్ స్లిట్ అంటారు. అందులో కాంతి పరిమాణాన్ని సూచించే కణమే ఫోటాన్.

మొత్తం 50 కలలు కన్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వాటిలో 11 పూర్తి చేశారు.

మిగతావి ఇక పూర్తయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఆ కలలు కన్న కన్నులు ఆదివారం శాశ్వతంగా మూసుకుపోయాయి.

మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

https://www.youtube.com/watch?v=gQARqzH3e-w&t=10s

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Here are the 50 Dreams of Sushanth singh rajput that dint turn into reality
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X