వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇప్పటికీ భారత్ దిగుమతుల్లో చైనానే కీలకం... ఈ ఉత్పత్తులు ఇప్పటికీ డ్రాగన్ కంట్రీ నుంచే...

|
Google Oneindia TeluguNews

ఇటీవల లదాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చాలామంది భారతీయులు డ్రాగన్ కంట్రీకి చెందిన యాప్స్‌ను తమ సెల్‌ఫోన్స్ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. అయితే యాప్స్‌ వరకు ఇది సాధ్యమైంది కానీ ఇప్పటికీ పలు కీలక రంగాలకు సంబంధించిన ఉత్పత్తుల కోసం భారత్ చైనా పైనే ఆధారపడుతోంది. భారత్‌కు సంబంధించిన వాణిజ్యపరమైన ఎగుమతుల్లో 9శాతం,దిగుమతుల్లో 18శాతం వాటా చైనాదే కావడం గమనార్హం. ఏయే ఉత్పత్తుల కోసం భారత్ చైనాపై ఎక్కువ ఆధారపడుతుందో ఒకసారి పరిశీలిద్దాం..

ఎలక్ట్రిక్ మెషినరీ,న్యూక్లియర్ రియాక్టర్ ఉత్పత్తులు..

ఎలక్ట్రిక్ మెషినరీ,న్యూక్లియర్ రియాక్టర్ ఉత్పత్తులు..


ఎలక్ట్రికల్ మెషినరీ కోసం భారత్ ఎక్కువగా చైనా పైనే ఆధారపడుతున్నది. 2019లో 34శాతం ఎలక్ట్రికల్ ఉత్పత్తులను చైనా నుంచి దిగుమతి చేసుకున్నది. టీవీలు,కెమెరాలు,ఎలక్ట్రికల్ ట్రాన్స్‌ఫార్మర్స్,మైక్రోఫోన్స్,హెడ్ ఫోన్స్,లౌడ్ స్పీకర్స్,టెలివిజన్ విడి భాగాలు,రేడియో,రాడార్ అపరేటస్,ట్రాన్స్‌మిషన్ అపరేటస్ ఫర్ రేడియోటెలీఫోనీ వంటి ఉత్పత్తులను భారత్ చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నది. న్యూక్లియర్ రియాక్టర్లకు సంబంధించి 2019లో 18శాతం ఉత్పత్తులను చైనా నుంచి దిగుమతి చేసుకున్నది.

కెమికల్స్,జువెలర్స్,ఎరువులు...

కెమికల్స్,జువెలర్స్,ఎరువులు...


ఆర్గానిక్ కెమికల్స్‌కు సంబంధించి 2019లో 10శాతం ఉత్పత్తులను చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకున్నది. అలాగే జెమ్స్&జ్యువెలర్స్‌ ఉత్పత్తులను 2019లో 6శాతం దిగుమతి చేసుకున్నది. ప్లాస్టిక్ గూడ్స్‌కు సంబంధించి 4శాతం ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నది. ఇందులో డిస్పెన్సర్ పంప్స్,టాయ్స్,రబ్బర్ తదితర ఉత్పత్తులు ఉన్నాయి. భారత్ ఉపయోగించే ఎరువుల్లో 2శాతం ఎరువులను చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నది. ముఖ్యంగా డయామోనియం ఫాస్పెట్,యూరియా వంటి ఎరువులను చైనా నుంచి మన దేశం దిగుమతి చేసుకుంటున్నది.

Recommended Video

Coronavirus To End On June 21 Solar Eclipse 2020, Scientist Claims!
మెడికల్ ఎక్విప్‌మెంట్..

మెడికల్ ఎక్విప్‌మెంట్..


మెడికల్ ఎక్విప్‌మెంట్‌కు సంబంధించి 2019లో 2శాతం ఉత్పత్తులను చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్నది. ఇందులో పీపీఈ,వెంటిలేటర్స్,ఎన్95 మాస్కులు,మెడికల్ కిట్స్ ఉన్నాయి. ఆటో మొబైల్ ఇండస్ట్రీకి సంబంధించి డ్రైవ్ ట్రాన్స్‌మిషన్,స్టీరింగ్,ఎలక్ట్రికల్స్,ఇంటీరియర్స్,బ్రేక్ సిస్టమ్స్ వస్తువులను భారత్ చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నది. 2019లో ఈ రంగానికి సంబంధించి 2శాతం ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. ఐరన్,స్టీల్ రాడ్‌ను కూడా 4శాతం చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటోంది.

English summary
China is one of the leading trade partners of India. Let’s take a look at some of the items for which India relies on the neighbouring country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X