Hero: స్టార్ హీరోకు సినిమా చూపించాలని సిద్దం అయిన క్రైమ్ బ్రాంచ్, అధికారుల హత్యకు స్కెచ్, నటి !

కొచ్చి/తిరువనంతపురం: బహుబాష నటిని కిడ్నాప్ చేసి రౌడీలతో లైంగిక దాడి చేయించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టార్ హీరోకు మరోసారి 70 ఎంఎం సినిమా చూపించడానికి క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు సిద్దం అయ్యారు. ఇప్పటికే ప్రముఖ నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో అరెస్టు అయ్యి జైలుపాలై బెయిల్ మీద బయటకు వచ్చిన ఆ హీరో కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారులను హత్య చెయ్యడానికి అతని గెస్ట్ హౌస్ లో బంధువులు, స్నేహితులతో కలిసి స్కెచ్ వేశాడని వెలుగు చూసింది. పోలీసు అధికారుల హత్యకు స్కెచ్ వేసిన ఆ హీరో మీద మరో కేసు నమోదు కావడం కలకలం రేపింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకోవాలని ఆ హీరో అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే కోర్టులో ఆ హీరోకు చుక్కెదురు కావడంతో అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు, స్నేహితులను మూడు రోజులు విచారణ చేసి పూర్తి సమాచారం బయటకు లాగాలని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సర్వం సిద్దం చేసుకుంటున్నారు. ఈ కేసులో స్టార్ హీరో పోలీసు అధికారుల హత్యకు కుట్ర పన్నాడు అని వెలుగు చూస్తే అతనికి చెక్క భజన గ్యారెంటీ అంటూ ఓ సీనియర్ పోలీసు అధికారి, న్యాయనిపుణలు అంటున్నారని స్థానిక మీడియా తెలిసింది.

 ప్రముఖ నటి కిడ్నాప్.... కారులో ?

ప్రముఖ నటి కిడ్నాప్.... కారులో ?

మలయాళం, తమిళ బాషల్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి 2017లో కేరళలో సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని కారులో బయలుదేరింది. మార్గం మద్యలో కారులో వెలుతున్న ఆ నటిని కిడ్నాప్ చేసిన కొందరు నిందితులు ఆమె మీద లైంగిక దాడి చేసి వీడియోలు తీశారని అప్పట్లోనే ఆ నటి ఫిర్యాదు చెయ్యడంతో కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు.

నటి కేసులో స్టార్ హీరో అరెస్టు

నటి కేసులో స్టార్ హీరో అరెస్టు

ప్రముఖ నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో మలయాళం సినీ రంగంలో టాప్ 5 హీరోల్లో ఒక్కరైన హీరో దిలీప్ ను కేరళ పోలీసులు అప్పట్లో అరెస్టు చేసి జైలుకు పంపించారు. రెండు నెలలకు పైగా జైలుపాలైన హీరో దిలీప్ తరువాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇదే కేసులో హీరో దిలీప్ కేరళ హై కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు తిరిగేశాడు.

 పోలీసు అధికారుల హత్యకు కుట్ర ?

పోలీసు అధికారుల హత్యకు కుట్ర ?

బెయిల్ మీద బయటకు వచ్చిన హీరో దిలీప్ నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో కోర్టు వాయిదాలకు తిరుగుతున్నాడు. ప్రముఖ నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసు అప్పట్లో కేరళ, తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ కేసు విచారణ చేస్తున్న కొందరు పోలీసు అధికారులను హత్య చెయ్యడానికి హీరో దిలీప్ అతని బంధువులు, స్నేహితులతో కుట్ర పన్నాడని ఆరోపణలు వెలుగు చూడటం కలకలం రేపాయి.

 హీరో ఇంట్లో స్కెచ్ ?

హీరో ఇంట్లో స్కెచ్ ?

నటి కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారులను హత్య చెయ్యడానికి హీరో దిలీప్ 2017 అలువాలోని అతని ఇంట్లో అతని సోదరుడు పి. శివకుమార్ అలియాస్ అనూప్, దిలీప్ బావ టీఎన్. సూరజ్, బంధువు అప్పు, స్నేహఇతుడు బైజూ చెయంగనాడ్, హోటల్ యజమాని శరత్ తో కలిసి స్కెచ్ వేశాడని వెలుగు చూసింది.

 హీరోకు చెక్కెదురు

హీరోకు చెక్కెదురు

పోలీసు అధికారుల హత్యకు స్కెచ్ వేసిన మలయాళం హీరో దిలీప్ మీద మరో కేసు నమోదు కావడం కలకలం రేపింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకోవాలని హీరో దిలీప్ కోర్టులో అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే హీరో దలీప్ కు బెయిల్ ఇవ్వకూడదని కేరళ పోలీసులు 68 పేజీల అఫిడవిట్ దాఖలు చేశారు. హీరో దిలీప్ కు ముందస్తు బెయిల్ మంజూరు చెయ్యకూడదని కేరళ పోలీసులు కేరళ హై కోర్టులో మనవి చేశారు.

 డేట్ ఫిక్స్ చేసిన పోలీసు అధికారులు

డేట్ ఫిక్స్ చేసిన పోలీసు అధికారులు

హీరో దిలీప్ పోలీసు అధికారులను చంపేయాలని స్కెచ్ వేశాడని ప్రముఖ మలయాళం సినీ దర్శకుడు బాలచంద్ర కుమార్, హీరో దిలీప్ మాజీ స్నేహితుడు ఆ విషయం లీక్ చెయ్యడంతో కథ కొత్త మలుపు తిరిగింది. హీరో దిలీప్ తో పాటు అతని సోదరుడు పి. శివకుమార్ అలియాస్ అనూప్, దిలీప్ బావ టీఎన్. సూరజ్, బంధువు అప్పు, స్నేహఇతుడు బైజూ చెయంగనాడ్, హోటల్ యజమాని శరత్ జనవరి 23, 24, 25 తేదీల్లో విచారణ చేసి ఆ వివరాలను సీల్డ్ కవర్ లో కోర్టులో సమర్పించడానికి కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు సిద్దం అయ్యారు. మొత్తం మీద బహుబాష నటిని కిడ్నాప్ చేసి రౌడీలతో లైంగిక దాడి చేయించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టార్ హీరో దిలీప్ కు మరోసారి 70 ఎంఎం సినిమా చూపించడానికి క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు సిద్దం అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+