ఆర్కె నగర్ పోరు: ఆటోగ్రాఫ్ దర్సకుడు చేరన్‌కు విశాల్ వార్నింగ్

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: ఆటోగ్రాఫ్ సినిమా దర్శకుడు చేరన్‌కు తమిళ హీరో విశాల్ హెచ్చరిక చేశారు. ఆర్‌కే నగర్‌లో పోటీని విరమించుకోవాలని విశాల్‌ను చేరన్ డిమాండ్ చేశారు. దానిపై విశాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమిళ 'ఆటోగ్రాఫ్' సినిమా దర్శకుడు చేరన్‌ డిమాండ్‌ చేయడంపై విశాల్ స్పందించారు. బెదిరింపులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని విశాల్ చేరన్ను హెచ్చరించారు. చేరన్ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఓ కామెంట్‌ పోస్ట్‌ చేశారు.

విశాల్ రాజీనామా చెయ్యాలి: వదిలి పెట్టం, పదవులు అడ్డం పెట్టుకుని రాజకీయాలు?

జీర్ణించుకోలేకపోతున్నానని చేరన్

జీర్ణించుకోలేకపోతున్నానని చేరన్

ఆర్‌కే నగర్‌ ఉప ఎన్నికల్లో విశాల్ పోటీ చేయడాన్ని తాము జీర్ణించుకోలేక పోతున్నట్టు చేరన్ చెప్పారు. ఆయన ఎవరి ప్రోద్బలంతోనో పోటీ చేస్తున్నారని, ఫలితంగా ఆయన బలిపశువు అవుతారని ఆయన అన్నారు.

విశాల్ కరుణానిధిని కలుసుకుని...

విశాల్ కరుణానిధిని కలుసుకుని...

నడిగర్‌ సంఘం ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన వెంటనే విశాల్ డీఎంకే అధినేత ఎం.కరుణానిధిని కలుసుకుని, ఆయన ఆశీర్వాదం తీసుకుని తమను ఆశ్చర్యానికి గురి చేశారని చేరన్ అన్నారు. ఇపుడు ఆర్‌కే నగర్‌ ఉపఎన్నికల్లో నామినేషన్‌ దాఖలు చేసేముందు మెరీనా తీరంలోని ఎంజీఆర్‌, జయలలిత సమాధులకు అంజలి ఘటించడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటని ప్రశ్నించారు.

నిర్మాతలు నష్టపోతారు...

నిర్మాతలు నష్టపోతారు...

విశాల్ ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని విశాల్‌ నిర్ణయం తీసుకోవడంతో చిత్ర పరిశ్రమ నిర్మాతలు తీవ్రంగా నష్టపోతారని చేరన్ తెలిపారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల విశాల్‌కు ఏ విధమైన ప్రయోజనం కూడా చేకూరదని ఆయన అన్నారు. నిర్మాతల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని విశాల్‌ నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి తక్షణం రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేకపోతే తమిళ చిత్రపరిశ్రమ అనేకమంది అశోక్‌కుమార్‌లను చూడాల్సి వస్తుందన్నారు.

విశాల్ ఇలా స్పందించారు...

విశాల్ ఇలా స్పందించారు...

చేరన్ వ్యాఖ్యలపై విశాల్ తీవ్రంగా స్పందించారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ పోతే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. చేరన్‌కు సమాధానం ఇస్తూ విశాల్ ఓ లేఖను విడుదల చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tamil hero Vishal gave fitting reply to Autograph film director Cheran on RK Nagar contest in Tamil Nadu.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి