ముంచేసిన మిగ్ జాం తుపాను, స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు, ఎమ్మెల్యేలు బయటకు రారా ?
మిగ్ జాం తుపాన్ కారణంగా తమిళనాడు రాజధాని చెన్నై కొంచెం తేరుకుంటున్నది. చెన్నై విమానాశ్రయంలో విమానాల రాకపోకలను పునరుద్దంచారు. అయితే చెన్నై నగరం వరద ప్రాభావం నుంచి తేరుకోవడానికి కొంచెం సమయం పట్టేఅవకాశం ఉందని అధికారులు అంటున్నారు. చెన్నై సిటీలోని పలు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు వరదనీటితో నానా ఇబ్బందులు పడుతున్నారు.
మిగ్ జాం తుపాను వల్ల సంభవించిన నష్టాన్ని సరిచేయడానికి చెన్నైకి చెందిన ఎమ్మెల్యేలు వారి ఇళ్ల నుంచి బయటకు రావాలని ప్రముఖ హీరో, నిర్మాత విశాల్ మనవి చేశారు. మిగ్ జాం తుపాను చెన్నై నగరాన్ని అతలాకుతలం చేసింది. చెన్నై నగరంలోని అన్ని ప్రాంతాలు జలమయం అయ్యాయి. సోమవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. పలుచోట్ల తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసి భోజన సదుపాయం కల్పించారు.

చెన్నై సిటీలో నివాసం ఉంటున్న పలు ప్రాంతాల ప్రజలు దేవాలయాలు, మసీదులు, మందిరాలలో తాత్కాలికంగా బస చేశారు. మిగ్ జాం తెపాను చెన్నైకి 100 కి.మీ దూరంలో ఉంది. సోమవారం రాత్రి మిగ్ జాం తుపాను ఆంధ్రప్రదేశ్ వైపు కదిలింది. మిగ్ జాం తుపాను ఆంధ్రప్రదేశ్ వైపు కదలడంతో చెన్నైలో భారీగా పడుతున్న వర్షం నిలిచిపోయింది. అయితే అప్పటికే చెన్నై నగరాన్ని మిగ్ జాం తుపాను అతలాకుతలం చెయ్యడంతో నష్టం ఎక్కువగానే ఉంది.
తమిళనాడు ప్రభుత్వ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో పని చేస్తోంది. చెన్నై సిటీలో పలుచోట్ల నిలిచిపోయిన వరదనీరు, వర్షపు నీరుతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం రాత్రి ప్రముఖ నటుడు విశాల్ మిగ్ జాం తుపాను ప్రభావాల గురించి వీడియోను విడుదల చేశారు. హీరో విశాల్ పోస్ట్ చేసిన వీడియోలో తుపానులు, వర్షాల వల్ల ముందుగా కరెంటు ఆగిపోతుందని, ఆ తర్వాత ఇంట్లోకి నీరు వస్తుందని, అలాగే అన్నానగర్‌లోని మా ఇంట్లోకి కూడా నీళ్లు వచ్చాయని వివరించారు.
అన్నానగర్‌లోని ఇళ్లలోకి నీరు వచ్చాయంటే చెన్నై సిటీలోని ఇతర ప్రాంతాల గురించి ఆలోచించండి అంటూ హీరో విశాల్ తమిళనాడు ప్రభుత్వాన్ని, చెన్నై సిటీలోని అన్ని పార్టీల ఎమ్మెల్యేల ప్రశ్నించారు. 2015లో ఇలాంటి తుపాను వచ్చిన వెంటనే అందరం రంగంలోకి దిగి ప్రజల కోసం పనిచేశామని, వీలైనంత ఎక్కువ మందికి సేవ చేశామని, 8 ఏళ్లు గడిచినా చెన్నై సిటీ అలాగే అధ్వానంగా మారడం ప్రశ్నార్థకంగా మారిందని హీరో విశాల్ విచారం వ్యక్తం చేశారు.

చెన్నై సిటీ కార్పొరేషన్ పరిధిలోని వర్షపు నీటి నిల్వల నిర్వహణ, డ్రెయినేజీల పథకం ఏమైందో నాకు తెలియదని, ఎందుకు పదేపదే అధికారులు నిర్లక్షం వహిస్తున్నారో అర్థం కావడం లేదని హీరో విశాల్ చెన్నై కార్పోరేషన్ అధికారులపై విచారం వ్యక్తం చేశారు. ఓటరుగా నేను దీన్ని అభ్యర్థిస్తున్నాను, చెన్నై సిటీలోని అన్ని నియోజక వర్గాలలోని ఎమ్మెల్యేలు దయచేసి బయటకు వచ్చి మిగ్ జాం తుపాను కారణంగా అతలాకుతలం అయిన చెన్నై సిటీని చక్కదిద్దితే చాలా బాగుంటుందని హీరో విశాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వాళ్ల ఇళ్ల నుంచి బయటకు వచ్చి సహాయం చేస్తే ప్రజలకు భద్రత, విశ్వాసం ఉంటుందని, మా ఇంట్లో సీనియర్ సిటిజన్స్ అయిన అమ్మ, నాన్న భయపడుతున్నారని, అన్ని ఇళ్లలో ఇలాగే ఉంటుందని, ఇప్పుడు ప్రతిచోటా వరద నీరు, వర్షం నీరు ఉండటం అందరికి ఇబ్బందిగా మారిందని, చాలా అసహ్యంగా అనిపిస్తుందని, దీన్ని తక్షణమే పరిష్కరించేందుకు చెన్నై కార్పొరేషన్ ముందుకు రావాలని, అవసరం అయితే మేము కూడా రంగంలోకి దిగుతామని హీరో విశాల్ అన్నారు.
అసలు మేము చెన్నై కార్పోరేషన్ ఎందుకు పన్ను చెల్లిస్తున్నామని అడగలేదని, సహాయం చెయ్యాలని మాత్రం అడుగుతున్నామని హీరో విశాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మిగ్ జాం తుపాను కారణంగా నానా తిప్పలు పడుతున్న చెన్నై సిటీ ప్రజలు చెన్నై కార్పోరేషన్ అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టకుండా నిర్లక్షం చేస్తున్నారని మండిపడుతున్నారని తమిళ మీడియా అంటోంది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications