డీసెంట్ ఫ్యామిలీలు ఉండే ఏరియాలో హైటెక్ వేశ్యవాటిక, బెంగళూరు, ముంబాయి మసాలా !
బెంగళూరు/ఉడిపి: అందమైన అమ్మాయిలు, ఆంటీలను అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాధించాలని ఓ గ్యాంగ్ స్కెచ్ వేసింది. సిటీల్లోని అమ్మాయిలు, వివాహిత మహిళలను ప్రలోభపెట్టి వారికి డబ్బులు ఎక్కువగా ఇస్తామని చెప్పి వారిని హైటెక్ వేశ్యవాటికలోకి దింపారు. వారంలో కొన్ని రోజులు ట్రిప్ అని చెప్పి ఓ ఇంటిలో హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్నారని వెలుగు చూసింది.
కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని మణిపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివల్లి ప్రాంతంలోని విద్యారత్న నగర్‌లోని భవానీ అనే మహిళ ఇంటిపై పోలీసులు దాడి చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి ఐదుగురు మహిళలను రక్షించినట్లు ఉడిపి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అక్షయ్ హక్ మచింద్ర ఒక ప్రకటనలో తెలిపారు. అరెస్టు అయిన నిందితులు అబ్దుల్ సలామత్, చంద్రహాస్ అని పోలీసులు చెప్పారు.

వ్యామోహంలో ఉన్న వ్యక్తుల నుంచి డబ్బులు వసూలు చేసి అనైతిక కార్యకలాపాలు సాగించడానికి ఇంటిని అద్దెకు తీసుకున్నారని పోలీసులు అన్నారు. ప్రధాన నిందితుడు ఖలీద్ అక్కడి నుంచి పరారయ్యాడని పోలీసులు చెప్పారు. శాంతినగర్‌లోని ఓ ఇంటిపై బ్రహ్మావరం సీఐ దివాకర్ ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు దాడులు నిర్వహించారు.
ఆ ఇంటిలో వ్యభిచార కార్యకలాపాలు సాగిస్తున్నారని తెలుసుకుని ఆ ఇంటిని సీజ్ చేసి విచారణ కొనసాగిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ఉడిపి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అక్షయ్ మచింద్ర ఆధ్వర్యంలో అదనపు పోలీసు సూపరింటెండెంట్ సిద్దలింగప్ప, ఉడిపి డివైఎస్‌పి దినక, మణిపాల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్‌పెక్టర్ దేవరాజ్ ఆధ్వర్యంలో కేసు విచారణ జరుగుతోంది.












Click it and Unblock the Notifications