హిమాచల్ ప్రదేశ్ హై అలర్ట్: పర్యాటకులు రిటన్

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ లో అక్కడి ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. కుండపోత వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో జనజీవనం స్తంభించిపోవడంతో స్థానికులు నానా ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.

ప్రసిద్ది చెందిన పర్యాటక కేంద్రాలైన సిమ్లా, సిర్మార్, కులు జిల్లాలలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. వాహన సంచారం అస్తవ్యస్థం అయ్యింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోతున్నాయి. హై వేలలో వాహనాల రాకపోకలకు వీలు కల్పిస్తున్నారు.

High alert was issued in Himachal Pradesh after heavy rains lash

లోతట్టు ప్రాంతాలలో నివాసం ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వారికి పునరావాస కేంద్రాలు ఎర్పాటు చేస్తున్నారు. వాగులు, వంకలు, నదులు ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేకపోయినా పరిసర ప్రాంతాలలో నివాసం ఉంటున్న వారిని వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు.

కొండచరియలు విరిగిపడుతాయని భయపడిన చాల మంది ఇండ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. పలు జిల్లాలలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రభుత్వ అధికారులు సెలవులు పెట్టరాదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా పర్యాటకులు వెనుతిరిగి వెళుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+