భారత్‌లో తగ్గని డెల్టా వేరియంట్ ప్రతాపం: వ్యాక్సిన్ వేసుకున్నవారిపైనా తీవ్ర ప్రభావం
న్యూఢిల్లీ: మనదేశంలో ఓ వైపు కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ.. నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా డెల్టా వేరియంట్ కేసులు ఉండటం కలవరపెడుతోంది. జీనోమ్ సీక్వెన్సింగ్ గవర్నమెంట్ కన్సోర్టియమ్ ఆఫ్ ల్యాబొరేటరీస్ ఐఎన్ఎస్ఏసీవోజీ ఈ మేరకు వెల్లడించింది.

భారత్‌లో డెల్టా వేరియంట్ తీవ్ర ప్రభావం
దేశంలో వ్యాప్తి చెందుతున్న కరోనా కేసుల్లో ఎక్కువగా డెల్టా వేరియంట్ రకానికి చెందినవేనని, కరోనా వేసుకున్న వారిపైనా ఈ రకం వైరస్ ప్రభావం చూపుతోందని ఐఎన్ఎస్ఏసీవోజీ తెలిపింది. అంతేగాక, వ్యాక్సిన్ ప్రభావాన్ని తగ్గించేలా ఈ వైరస్ ఉందని పేర్కొంది. ఈ డెల్టా వేరియంట్ కారణంగానే కరోనా వ్యాప్తి ఎక్కువగా జరుగుతోందని వెల్లడించింది.
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులపై వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుందని, మరణం నుంచి తప్పించుకోవచ్చని, ఆస్పత్రికి వెళ్లే అవకాశాలు కూడా తగ్గుతాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొన్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వ్యాప్తి కూడా తగ్గే అవకాశం ఉంటుందని తెలిపింది.

ఎక్కువ కేసులు డెల్టా వేరియంట్ వల్లే..
అయితే, వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులపైనా డెల్టా వేరియంట్ ప్రభావం ఎక్కువగానే ఉంటుందని ఐఎన్ఎస్ఏసీవోజీ పేర్కొంటోంది. ప్రస్తుతం ఇటీవల 30,230 నమూనాలను పరీక్షింగా అందులో 20,324 కరోనా వెల్టా వేరియంట్ కేసులుగా తేలాయని ఐఎన్ఎస్ఏసీవోజీ తెలిపింది. మరేదైనా కొత్త వేరియంట్ వచ్చిందా అనేదానిపై పరిశోధనలు కొనసాగుతున్నాయని తెలిపింది.
భారతదేశంలో సెకండ్ వేవ్‌కు కారణమైన కరోనా డెల్టా వేరియంట్ గురించిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనదేశంతోపాటు ఈ డెల్టా వేరియంట్ అమెరికా, చైనా, కొరియా లాంటి దేశాల్లో అత్యధికంగా వ్యాప్తి చెందుతోంది. డెల్టా పస్ల కే417ఎన్ మ్యూటేషన్ కారణంగా కొరియాలో అత్యధిక కరోనా కేసులు నమోదువుతున్నాయని తేలింది. ఈ డెల్టా వేరియంట్ సెకండ్ వేవ్‌లో మనదేశంలో ఆరోగ్య వ్యవస్థను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన విషయం తెలిసిందే. లక్షలాది మంది కరోనా బారినపడగా, వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్, ఐసీయూ బెడ్లు దొరక్కపోవడంతో కరోనా బాధితులు ఎక్కువ సంఖ్యలో మరణించారు.

డెల్టా ప్లస్ తీవ్రత తక్కువే..
దేశంలో ఏవై.1, ఏవై.2, ఏవై.3(డెల్టా పస్ల్) కొత్త కేసులు జులై నెలలో వెలుగుచూశాయి. మహారాష్ట్ర 1 శాతం కేసులు నమోదయ్యాయి. అయితే, డెల్టా వేరియంట్ కంటే ఎక్కువగా డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి జరగలేదు. ఇప్పటి వరకు 61 డెల్టా ప్లస్ వేరియంట్ లను దేశంలో గుర్తించారు. డెల్టా వేరియంట్ కారణంగానే అత్యధిక కేసులు నమోదయ్యాయి.
వ్యాక్సిన్ వేసుకున్నవారిపైనా డెల్టా వేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉండటం గమనార్హం.
Recommended Video

దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నా.. కానీ
ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,36,605కు తగ్గింది. ఇది గత 150 రోజులలోనే తక్కువ. ఇది మొత్తం కేసుల్లో 1.12 శాతంగా ఉంది. శుక్రవారం నాటికి దేశంలో 57 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఆర్ వాల్యూ లేదా రిడక్షన్ రేట్ ప్రస్తుతం దేశంలో 0.89 శాతానికి తగ్గింది. అయినప్పటికీ దేశంలో ప్రతిరోజు 25వేల కంటే ఎక్కువ కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి.
న్యూ వేరియంట్ వ్యాపిస్తున్న నేపథ్యంలో దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగంగా జరపాల్సి ఉందని ఐఎన్ఎస్ఏసీవోజీ అభిప్రాయపడింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం, కరోనా జాగ్రత్తలు తీసుకోవడం, నిబంధనలు పాటించడం చేస్తే దేశంలో కరోనా కేసుల వ్యాప్తి మరింతగా తగ్గే అవకాశం ఉందని తెలిపింది.
-
3 ప్రభుత్వ బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఊరుకునేదే లేదంటూ !! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్..












Click it and Unblock the Notifications