బీహార్ ఎన్నికలు: మాహాకూటమి విజయం, హైలెట్స్ ఇవే
పాట్నా: దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. సీఎం నితీశ్ కుమార్ సారధ్యంలోని మహాకూటమి తిరుగులేని ఆధిక్యతను సాధించింది. ఈ సందర్భంగా భారత ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) నజీమ్ జైదీ మీడియాతో మాట్లాడారు. బీహార్ ఎన్నికల ఫలితాలు, హైలెట్స్ గురించి ఆయన ప్రస్తావించారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల హైలెట్స్:
* అధిక సంఖ్యలో మహిళా ఓటర్లు తమ పేరు నమోదు చేసుకునేలా ఏప్రిల్‌లో ఈసీ ప్రణాళిక రచించింది.
* 2010 ఎన్నికలతో పోలిస్తే ఈసారి 50 లక్షల మంది మహిళా ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు (గతంలో 1.4 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 1.9 కోట్లు)
* ఎన్నికల కమిషన్ సాధించిన అద్భుతమైన విజయం ఇదే
* అత్యంత కట్టుదిట్టంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాం
* ఈసారి ఎన్నికల్లో ఎక్కవ మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు
* మద్యం సరఫరా, డబ్బు వెదజల్లి ఓటర్లను ప్రలోభ పెట్టకుండా భారీ నిఘా పెట్టామన్నారు.
* పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ, నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నాం. 2010లో రూ. 35 లక్షలు సీజ్ చేయగా, 2015లో రూ. 50 కోట్లు సీజ్ చేశాం.
* అతి తక్కువ సమయంలో ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాం
* ఎటువంటి హింసాత్మక ఘటనలు, రక్తపాతం చోటుచేసుకోక పోవడం విశేషం
* 2010, 2015 ఓటర్ల డేటాను పోల్చి చూస్తే, అదనంగా 1.2 కోట్ల మంది ఓటర్లు కొత్తగా వచ్చి చేరడం
* సీఈసీ టీమ్ వర్క్
* కొన్ని రాజకీయ పార్టీలు తమ ఏజెంట్లను బూత్ లెవెల్లో నియమించడం
* తద్వారా ఓటర్లకు ఓటింగ్‌పై అవగాహన కల్పించడంతో పాటు సరైన సమాచారం అందించడం

ఈ ఎన్నికల్లో 50 లక్షల మంది మహిళా ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకోవడంమనేది ఎన్నికల కమిషన్ సాధించిన విజయమని నజీమ్ జైదీ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications