Hightec Sketch: కానిస్టేబుల్ ఉద్యోగాలు, బ్లూటూత్ లు పెట్టుకుని క్రిమినల్ మైండ్ తో పరీక్షలు రాసి !
బెంగళూరు/ కలబురిగి: కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు పరీక్షలు రాశారు. ఎలాగైనా పోలీసు ఉద్యోగాలు సంపాధించి సంఘంలో మంచి పేరు తెచ్చుకోవాలని కొందరు ప్రయత్నించారు. అయితే కొందరు మాత్రం క్రిమినల్ మైండ్ తో పోలీసు ఉద్యోగాలు సంపాధించి ఉద్దరగా జీతాలు తీసుకోవాలని ప్రయత్నించారు. మారుతున్న టెక్నాలజీని ఉపయోగించిన కొందరు నిరుద్యోగులు పరీక్షా కేంద్రాల్లో కుర్చుని బ్లూటూత్ సహాయంలో ప్రశ్నపత్రాలు లీక్ చేసి జబాబులు తెలుసుకుని పరీక్షలు రాయడానికి ప్రయత్నించారు. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఓ అమ్మాయితో పాటు 9 మంది అడ్డంగా బుక్కైపోయారు. విషయం తెలుసుకున్న పోలీసు శాఖ అధికారులు ఔరా ? ఏమి స్కెచ్ వేశారు కేటుగాళ్లు ? అని హడలిపోయారు.

కర్ణాటకలో పోలీసు ఉద్యోగాల కోసం పరీక్షలు
కర్ణాటకలోని పోలీసు శాఖ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చెయ్యడానికి పరీక్షలు నిర్వహించారు. కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఆదివారం వేల సంఖ్యలో నిరుద్యోగులు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు రాశారు. ఎలాగైనా పోలీసు ఉద్యోగాలు సంపాధించి సంఘంలో మంచి పేరు తెచ్చుకోవాలని కొందరు ప్రయత్నించారు.

క్రిమినల్ మైండ్
కర్ణాటకలోని కలబురిగిలోని జీవర్గిలో కొందరు మాత్రం క్రిమినల్ మైండ్ తో పోలీసు ఉద్యోగాలు సంపాధించి ఉద్దరగా జీతాలు తీసుకోవాలని ప్రయత్నించారు. మారుతున్న టెక్నాలజీని ఉపయోగించిన కొందరు నిరుద్యోగులు పరీక్షా కేంద్రాల్లో కుర్చుని బ్లూటూత్ సహాయంలో ప్రశ్నపత్రాలు లీక్ చేసి జబాబులు తెలుసుకుని పరీక్షలు రాయడానికి ప్రయత్నించారు.

సర్వేయర్, కోచింగ్ సెంటర్ ఓనర్ స్కెచ్
జీవర్ణిలోని సర్వేయర్ గా ఉద్యోగం చేస్తున్న రాయప్ప (34) అనే వ్యక్తి జోక్యం చేసుకుని కానిస్టేబుల్ ఉద్యోగాలకు పరీక్షలు రాస్తున్న నిరుద్యోగులకు జవాబులు చెప్పే బాధ్యతను తలకు ఎత్తుకున్నాడు. జీవర్గిలోని కోచింగ్ సెంటర్ యజమాని దేవేంద్రప్పతో ఆరు లక్షల రూపాయలకు డీల్ మాట్లాడుకున్న సర్వేయర్ రాయప్ప రంగంలోకి దిగాడు.

లాడ్జ్ లో గైడ్స్, ల్యాప్ టాప్ లు, ట్యాబ్ లు పెట్టుకుని ?
కలబురిగిలోని ఓ లాడ్జ్ లో మకాం వేసిన నిందితులు ల్యాప్ టాప్ లు, ట్యాబ్ లు, మొబైల్ ఫోన్లు, బ్లూటూత్ ల సహాయంతో పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్న కొందరి నుంచి ప్రశ్నలు తెలుసుకుని వాటికి జవాబులు చెబుతున్నారు. పక్కా సమాచారం అందడంతో డీఎస్పీతో పాటు ఎస్ ఐ వాహిద్ హుస్సేన్ కోత్వాల్ తదితరులు లాడ్జ్ మీద దాడి చేశారు. అక్కడ జరుగుతున్న భాగోతం తెలుసుకున్న పోలీసులు మైండ్ బ్లాక్ అయ్యింది. సర్వసాధారణంగా పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.
Recommended Video

కానిస్టేబుల్ ఉద్యోగాల పరీక్షలు టార్గెట్
కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తున్న వారు మాస్ కాపియింగ్ కు పాల్పడటం పోలీసు శాఖలో కలకలం రేపింది. మాస్ కాపియింగ్ కు పాల్పడిన సర్వేయర్ రాయప్ప, కోచింగ్ సెంటర్ యజమాని దేవేంద్రప్ప, లింగరాజు, పరుశురామ, మహేష్, మాళప్ప, పీరప్ప, పరమేశ్వర్ అనే నిందితులను అరెస్టు చేసి ల్యాప్ టాప్ లు, రెండు ట్యాబ్ లు, 15 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారులు అన్నారు. అరెస్టు అయిన వారిలో ఓ నిరుద్యోగి యువతి కూడా ఉందని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. అయితే యువతి పేరు, వివరాలను పోలీసులు బయటకు చెప్పలేదు.












Click it and Unblock the Notifications