12 గంటలుగా భారీ ట్రాఫిక్ జామ్.. చిక్కుకున్న 500 మంది చిన్నారులు..

12 గంటలుగా భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనదారులు నరకయాతన పడుతున్నారు. రోడ్లపైనే గంటలతరబడి పడిగాపులు కాస్తున్నారు. ముంబై- అహ్మదాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ట్రాఫిక్ వలయంలో దాదాపు 500 మంది చిన్నారులు చిక్కుకున్నట్లు సమాచారం. మహారాష్ట్రలోని వసాయ్ ప్రాంతంలో ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 12 బస్సుల్లోని స్కూల్ విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు ఈ ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్నట్లు సమాచారం అందుతోంది.

మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోని వసాయ్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది. దాదాపు 12 గంటలకుపైగా వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో వాహనాల్లోనే ఉంటూ నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ ట్రాఫిక్ వలయంలో దాదాపు 500 మంది చిన్నారులు, వాహనదారులు చిక్కుకున్నట్లు సమాచారం. పిల్లలంతా 5 నుంచి 10 వ తరగతి చదువుతున్న వాళ్లే కావడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వీళ్లంతా స్థానికంగా ముంబై, థానే ప్రాంతాలకు చెందిన వాళ్లు.

ముంబై- అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ మంగళవారం సాయంత్రం 5 గంటల 30 నిమిషాల సమయంలో ప్రారంభం అయింది. బుధవారం ఉదయం వరకూ అలాగే ట్రాఫిక్ జామ్ కావడంతో చిన్నారులు, ఇతర వాహనదారులు రాత్రంతా ఇబ్బంది పడ్డారు. రహదారి కావడంతో సరిపడ ఆహారం, నీళ్లు లేక నరకయాతన అనుభవించారు. ముంబై, థానే పరిసరాల్లోని 12 స్కూల్లకు చెందిన పిల్లలంతా పిక్ నిక్ కు వెళ్తూ ఇలా చిక్కుకుపోయారు. తమ పిల్లలు ట్రాఫిక్ లో చిక్కుకుపోయారని తెలిసి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Highway Heartbreak 500 Kids Trapped in 12-Hour Traffic Nightmare on Mumbai-Ahmedabad Route

ఇక ఇప్పటికీ ట్రాఫిక్ జామ్ అలాగే ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఒక్క అంగుళం ముందుకు వెళ్లడానికి గంటల సమయం పడుతోందన్నారు. వీలైనంత త్వరగా ట్రాఫిక్ కు క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ లో చిక్కుకున్న వాహనదారులు, చిన్నారులకు ఆహారం, నీళ్లు సరఫరా చేస్తున్నట్లు వివరించారు. అయితే జాతీయ రహదారిపై రిపేర్ పనులు జరుగుతున్న కారణంగా ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లు అధికారులు అంచనావేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+