
Hijab Row: విదేశాల తీర్పులతో హిజాబ్ పిటిషన్లకు లింక్ పెట్టిన లాయర్, విద్యార్థు డిమాండ్ కాదు, మనవి !
బెంగళూరు: హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టులో వాడివేడిగా చర్చ జరిగింది. భారతదేశంలోని వివిద రాష్ట్రాల్లో జరిగిన ఇలాంటి పిటిషన విచారణ తీర్పుల వివరాలను హిజాబ్ కావాలని పిటిషన్లు వేసిన అమ్మాయిల తరపు న్యాయవాది కర్ణాటక హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. విదేశాల్లో జరిగిన హిజాబ్ లాంటి సంఘటనల తీర్పులను ఇదే సమయంలో కోర్టుకు వివరించారు. సౌత్ ఆఫ్రికా, టర్కీ, అమెరికా దేశాల్లో జరిగిన ఇలాంటి సంఘటన కేసు విచారణ తీర్పును అమ్మాయిల తరపు న్యాయవాది దేవదత్ కామత్ కర్ణాటక హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. హిజాబ్ లు వేసుకుంటామని అమ్మాయిలు మనవి చేస్తున్నారని, డిమాండ్ చెయ్యడం లేదని న్యాయవాది హైకోర్టులో చెప్పారు. హిజాబ్ వేసుకోకుండా ముస్లీం అమ్మాయిలు ఎలా చదువుకుంటారని ముస్లీం అమ్మాయిల తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. ప్రభుత్వ నియమాల ప్రకారం యూనీఫామ్ తో పాటు హిజాబ్ లు వేసుకుంటామని ముస్లీం విద్యార్థులు కోరుతున్నారని అమ్మాయిల తరుపు న్యాయవాది హైకోర్టులో మనవి చేశారు.
Recommended Video
Hijab Row: కాలేజ్ లు రీఓపెన్, ఎక్ట్స్రాలు చేస్తే ?, రంగంలోకి కేఎస్ఆర్పీ, విద్యార్థుల ఉత్సాహం !

విదేశాల తీర్పుతో హిజాబ్ కేసుకు లింక్ పెట్టిన న్యాయవాది
హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టులో వాడివేడిగా చర్చ జరిగింది. భారతదేశంలోని వివిద రాష్ట్రాల్లో జరిగిన ఇలాంటి పిటిషన విచారణ తీర్పుల వివరాలను హిజాబ్ కావాలని పిటిషన్లు వేసిన అమ్మాయిల తరపు న్యాయవాది దేవదత్ కామత్ కర్ణాటక హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. విదేశాల్లో జరిగిన ఇలాంటి సంఘటనల తీర్పులను ఇదే సమయంలో న్యాయవాది దేవదత్ కామత్ కర్ణాటక హైకోర్టుకు వివరించారు.

సౌత్ ఆఫ్రికా తీర్పు మీరే చూడండి
2004లో సౌత్ ఆఫ్రికాలోని సునాలీ పిళ్లై VS డర్బన్ గర్ల్స్ హైస్కూలో దక్షిణ భారతదేశానికి చెందిన ఓ విద్యార్థి (తమిళనాడు) ముక్కుకు అలాంకారం చేసుకుందని (ముక్కు పుడక) స్కూల్ యాజమాన్యం అభ్యంతరం వ్యక్తం చేసింది. ముక్కుకు అలంకారం చేసుకోకూడదని స్కూల్ యాజమాన్యం చెప్పడంతో ఇది మా రాజ్యంగం హక్కు అంటూ ఆ అమ్మాయి కోర్టుకు వెళ్లిందని న్యాయవాది దేవదత్ కమాత్ ఇదే సమయంలో గుర్తు చేశారు.

సౌత్ ఆఫ్రికా కోర్టులో అమ్మాయిదే విజయం
తరువాత దక్షిణ ఆఫ్రికా కోర్టులో తన ప్రాథమిక హక్కుల కోసం పోరాడిన దక్షిణ భారదేశం విద్యార్థి అక్కడి హైకోర్టులో ఆమె విజయం సాదించిందని, స్కూల్ యూనీఫామ్ వేరు, ముక్కు అలంకారం వేరు అనే విషయం నిరూపించుకుందని, దక్షిణ భారతదేశం హిందూ సాంప్రధాయం కోసం ఆ అమ్మాయి విదేశాల్లో పోరాటం చేసిందని ఇదే సమయంలో ఉడిపి ముస్లీం అమ్మాయిల తరపు వాదిస్తున్న న్యాయవాది దేవదత్ కామత్ గుర్తు చేశారు.

టర్కీలో ఎం జరిగిందంటే ?
హిజాబ్ లు దరించకూడదని అని నొక్కి చెప్పడానికి మనం టర్కీలో లేమని న్యాయవాది దేవదత్ కామత్ అన్నారు. టర్కీలో చట్టాలు, రాజ్యంగం వేరు, భారతదేశంలో చట్టాలు, రాజ్యాంగం వేరు అని ముస్లీం అమ్మాయిల తరపు న్యాయవాది దేవదత్ కామత్ అన్నారు. మతచిహ్నాలు బహిరంగంగా చూపించడం లేదని, మత విశ్వాసాలు కాపాడుకోవడం కోసం ముస్లీం అమ్మాయిలు హిజాబ్ లు ధరిస్తామని మనవి చేస్తున్నారని ఇదే సమయంలో న్యాయవాది దేవదత్ కామత్ అన్నారు. ఇదే సమయంలో అమెరికాలో జరిగిన ఒక కేసుకు సంబంధించిన తీర్పును ముస్లీం అమ్మాయిల తరపు న్యాయవాది కర్ణాటక హైకోర్టులో ఉదాహరణగా చెప్పారు. బుధవారం మద్యాహ్నం 2.30 గంటలకు కర్ణాటక హైకోర్టులో హిజాబ్ వివాదంపై దాఖలు అయిన పిటిషన్ విచారణ జరగనుంది.