Hijab Row: బుర్కాల వివాదం, సెలవులు, క్లారిటీ ఇచ్చిన మంత్రి, అందరూ శాంతిని కాపాడండి !
బెంగళూరు/ ఉడిపి: హిజాబ్ వివాదం రోజురోజుకు ముదిరిపోతోంది. హిజాబ్ వేసుకుని మేము కాలేజ్ కు వస్తామని ముస్లీం అమ్మాయిలు పట్టుబడుతున్నారు. హిజాబ్ లు వేసుకోవడానికి అమ్మాయిలకు అనుమతి ఇస్తే మేము కూడా కాషాయం కండువాలు వేసుకుని వస్తాయని కొందరు అబ్బాయిలు పట్టుబడుతున్నారు. శివమొగ్గ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో 144 సెక్షన్ అమలు చేశారు. ఇప్పటికే పోలీసులు లాఠీలకు పని చెప్పి ఎగిరిపడుతున్న కొందరికి దేహశుద్ది చేశారు. జాతియ జెండా ఎగరవేయడానికి ఏర్పాటు చేసిస స్థంభానికి కషాయం జెండా కట్టడంతో ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే సమయంలో కర్ణాటకలో మూడు రోజులు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అయితే హిజాబ్ విషయంలో కర్ణాటక విద్యాశాఖా మంత్రి క్లారిటీ ఇచ్చారు.
Recommended Video

కర్ణాటకలో హాట్ టాపిక్
కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో విద్యాసంస్థల్లో ముస్లీం అమ్మాయిలు బుర్కాలు వేసుకుని వస్తే మేము కూడా కాషాయం కండువాలు వేసుకుని నుదిటి మీద సింధూరం పెట్టుకుని కాలేజ్ లోకి వస్తామని హిందులు పట్టుబడుతున్నారు. కాలేజ్ విద్యార్థుల గొడవలతో మొదలైన బుర్కాల వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ఉడిపిలో మొదలైన హిజాబ్ వివాదం కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.

ఎవరికి వారే అంటూ ర్యాలీలు
బుర్కాలు (హిజాబ్ ) ధరించే విషయంలో శివమొగ్గలో రెండు వర్గాల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. మేము బుర్కాలు వేసుకుని కాలేజ్ కు వస్తామని ఓ వర్గం వారు ర్యాలీ నిర్వహించారు. పోటాపోటీగా మేము కూడా కాషయం కండువాలు వేసుకుని కాలేజ్ కు వెలుతామని మరో వర్గం వాళ్లు ర్యాలీ నిర్వహించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోటాపోటిగా ర్యాలీలు నిర్వహించడంతో శివమొగ్గలో పోలీసులు ఇరు వర్గాల ర్యాలీలు అడ్డుకొవడానికి 144 సెక్షన్ అమలు చెయ్యడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఏకాంగా ఒక అడుగు ముందుకు వేసేశారు
కాలేజ్ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో శివమొగ్గలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్బంలో కొందరు విద్యార్థులు కాషయం కండువాలు వేసుకుని ర్యాలీగా వెళ్లారు. జాతియ జెండా ఎగరవేయడానికి ఏర్పాటు చేసిస స్థంభానికి కషాయం జెండా కట్టడంతో ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

విద్యాశాఖా మంత్రి క్లారిటీ
హిజాబ్ వివాదం ముదిరిపోవడంతో కర్ణాటకలో మూడు రోజులు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అయితే హిజాబ్ విషయంలో కర్ణాటక విద్యాశాఖా మంత్రి బిసి. నాగేష్ క్లారిటీ ఇచ్చారు. కర్ణాటకలోని అన్ని విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు అందరూ శాంతిని కాపాడాలని మంత్రి నాగేష్ మనవి చేశారు. కర్ణాటక ప్రభుత్వం విద్యాసంస్థల యూనీఫామ్ విషయంలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటుందని మంత్రి నాగేష్ వివరణ ఇచ్చారు. కొందరు కావాలనే హిజాబ్ విషయంలో రాజకీయం చేస్తున్నారని మంత్రి నాగేష్ ఆరోపించారు. స్కూల్స్, కాలేజ్ లో చదువుతున్న విద్యార్థులు అందరిని సమానంగా చూడాలని ప్రభుత్వం చూస్తోందని, కావాలనే కొందరు విద్యార్థుల మద్య చిచ్చు పెట్టడానికి హిజాబ్ వివాదం పెద్దది చెయ్యాలని చూస్తున్నారని మంత్రి నాగేష్ ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఆదేశాలకే మేము కట్టుబడి ఉన్నామని, శాంతిని కాపాడాలని మరోసారి మనవి చేస్తున్నామని మంత్రి నాగేష్ అన్నారు.












Click it and Unblock the Notifications