బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Hijab: అర్జెంట్ గా పిటిషన్ విచారణ చెయ్యడం సాధ్యం కాదు, సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ, కారణం అదే!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/బెంగళూరు/ఉడిపి: హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టును సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన ముస్లీం అమ్మాయిలకు ఎదురుదెబ్బ తగిలింది. ఉడిపి ప్రభుత్వ కాలేజ్ లోకి హిజాబ్ వేసుకుని అడుగు పెట్టకూడదని కాలేజ్ ప్రిన్సిపాల్, కాలేజ్ అధ్యాపకులు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ కొంతకాలం క్రితం కొందరు ముస్లీం అమ్మాయిలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం (మార్చి 15వ తేదీ) ఉదయం హిజాబ్ లు దరించే విషయంలో కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది.

హిజాబ్ అనేది ఇస్లాంలో భాగం కాదని, హిజాబ్ లు కచ్చితంగా వేసుకోవాలని ఇస్లాంలో లేదని కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును తాము సుప్రీం కోర్టులో సవాలు చేస్తామని హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన ముస్లీం అమ్మాయిలు మంగళవారమే మీడియాకు చెప్పారు. హిజాబ్ విషయంలో కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన కర్ణాటక ముస్లీం అమ్మాయిలు మంగళవారమే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చెయ్యడంతో హిజాబ్ వివాదం సుప్రీం కోర్టుకు చేరింది.

కర్ణాటక హైకోర్టు తీర్పు వెలువడిన కొన్ని గంట్లోనే ముస్లీం అమ్మాయిల తరుపు న్యాయవాది సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం సుప్రీం కోర్టులో ముస్లీం అమ్మాయిలకు ఎదురుదెబ్బ తగిలింది. హిజాబ్ వివాదంపై దాఖలు అయిన పిటిషన్ అత్యవసరంగా విచారణ చెయ్యడం సాధ్యం కాదని సుప్రీం కోర్టు చెప్పింది.

Illegal affair: వదినతో వన్స్ మోర్, అర్దరాత్రి భర్త నిద్రలేచి చూస్తే ?, సైలెంట్ గా ఏం చేశాడంటే !Illegal affair: వదినతో వన్స్ మోర్, అర్దరాత్రి భర్త నిద్రలేచి చూస్తే ?, సైలెంట్ గా ఏం చేశాడంటే !

హైకోర్టు తీర్పును గౌరవిస్తాము.... మాకు అన్యాయం జరిగింది

హైకోర్టు తీర్పును గౌరవిస్తాము.... మాకు అన్యాయం జరిగింది

ఇస్లాం మతంలో హిజాబ్ అనేది ఒక భాగం కాదని, హిజాబ్ లు కచ్చితంగా వేసుకోవాలని ఇస్లాంలో లేదని కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. హిజాబ్ లు వేసుకుని విద్యాసంస్థల్లో వస్తామని ముస్లీం అమ్మాయిలు చెప్పడం సరికదాని కర్ణాటక హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. హిజాబ్ లు వేసుకోవాలని పట్టుపట్టకూడదని కర్ణాటక హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. హైకోర్టు తీర్పును మేము గౌరవిస్తామని, అయితే మాకు అన్యాయం జరిగిందని గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఉడిపి జిల్లా ముస్లీం అమ్మాయిలు అంటున్నారు.

గంటల్లోనే సుప్రీం కోర్టును ఆశ్రయించారు

గంటల్లోనే సుప్రీం కోర్టును ఆశ్రయించారు

కర్ణాటక హైకోర్టు తీర్పుతో మేమే షాక్ అయ్యామని, మాకు న్యాయం జరగలేదు అనిపిస్తోందని కొందరు ముస్లీం అమ్మాయిలు అన్నారు. మంగళవారం ఉడిపి ప్రెస్ క్లబ్ లో ముస్లీం అమ్మాయిలు ఆల్మాస్, ఆలియా ఆసాది తదితరులు మీడియాలో మాట్లాడారు.

మేము మా లాయర్లతో చర్చించి హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేస్తామని ఆల్మాస్, ఆలియా ఆసాది తదితరులు మీడియాకు చెప్పారు. మీడియాతో మాట్లాడిన కొన్ని గంటల్లోనే ముస్లీం అమ్మాయిలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

మొదటి నుంచి అమ్మాయిల వాదన అదే

మొదటి నుంచి అమ్మాయిల వాదన అదే

హిజాబ్ వేసుకోవడం మా మతం ఆచారం అని ముస్లీం అమ్మాయిలు అంటున్నారు. మాకు విద్యతో పాటు హిజాబ్ లు వేసుకోవడం ముఖ్యమని, మాకు రెండు కావాలని ముస్లీం అమ్మాయిలు అంటున్నారు. కొన్ని వేల మంది ముస్లీం అమ్మాయిలు హిజాబ్ లు వేసుకుని కాలేజ్ కు వెలుతామని, పరీక్షలు రాస్తామని అంటున్నారని ఇదే సమయంలో అమ్మాయిలు చెప్పారు. ఇదే సమయంలో కర్ణాటకకు చెందిన నిబా నాజ్ అనే అమ్మాయి తరపు న్యాయవాది సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. కర్ణాటక హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కొందరు ముస్లీం అమ్మాయిలు ఇప్పుడు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

అత్యవసరంగా విచారణ చెయ్యాలా ?: సుప్రీం కోర్టు

అత్యవసరంగా విచారణ చెయ్యాలా ?: సుప్రీం కోర్టు

కర్ణాటక హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలు అయిన పిటిషన్ ను బుధవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. హిజాబ్ వివాదంపై దాఖలు అయిన పిటిషన్ వెంటనే విచారణ చెయ్యాలని అడగుతున్నారని, అంత అవసరం ఏముందని సుప్రీం కోర్టు పిటిషనర్లను ప్రశ్నించింది. హిజాబ్ వివాదంపై దాఖలు అయిన పిటిషన్ వెంటనే విచారణ చెయ్యాలని పిటీషనర్ల తరుపు న్యాయవాది సంజయ్ హెడ్డే సుప్రీం కోర్టుకు మనవి చేశారు.

Recommended Video

Hijab Verdict: Karnataka High Court సంచలన తీర్పు |Karnataka Hijab Row | Oneindia Telugu
కోర్టుకు హోలీ సెలవులు....... వచ్చే వారం విచారణ జరిగే అవకాశం !

కోర్టుకు హోలీ సెలవులు....... వచ్చే వారం విచారణ జరిగే అవకాశం !

హోలీ సెలవులు ఉన్నాయని, వచ్చే వారం కూడా పిటిషన్ విచారణ చెయ్యవచ్చు కదా అని సుప్రీం కోర్టు పిటీషనర్ల తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. వచ్చే వారం హిజాబ్ వివాదంపై దాఖలు అయిన పిటిషన్ విచారణ చేస్తామని సుప్రీం కోర్టు చెప్పింది. గురువారం నుంచి సుప్రీం కోర్టుకు సెలవులు ఉన్నాయి. మార్చి 21వ తేదీ తరువాత సుప్రీం కోర్టులో హిజాబ్ వివాదంపై దాఖలు అయిన పిటిషన్ విచారణ జరిగే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు. హిజాబ్ వివాదంపై దాఖలు అయిన పిటిషన్ అత్యవసరంగా విచారణ చెయ్యడం సాధ్యం కాదని, కోర్టుకు సెలవులు ఉన్నాయని సుప్రీం కోర్టు చెప్పింది.

English summary
Hijab Row: Supreme Court refuses urgent hearing of appeal against Karnataka High court Verdict in Hijab row. The Apex Court will consider the petition after March 21st.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X