Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ లో సంక్షోభం.. సీఎం రాజీనామా..
రాజ్యసభ ఎన్నికలు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ లో సంక్షోభానికి కారణమయ్యాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ రాజీనామా చేశారు. బుధవారం సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సుఖ్వీందర్ సింగ్ తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధిష్టానానికి పంపారు. హిమాచల్ ప్రదేశ్ లో ఫిబ్రవరి 27 అంటే మంగళవారం రాజ్య సభ ఎన్నికలు జరిగాయి. ఇక్కడ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ(BJP)కి ఓటు వేశారు.
ఈ ఆరుగుతోపాటు ముగ్గురు స్వంతత్ర అభ్యర్థులు కూడా బీజేపీకి ఓటు వేయడంతో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయారు. దీంతో ఆ ఆరుగురు ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ ఆగ్రహంగా ఉన్నారు. దీంతోనే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. సీఎం రాజీనామాతో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ లో సంక్షోభానికి దారి తీసింది. వెంటనే రంగంలోకి దిగిన కాంగ్రెస్ అధిష్ఠానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

సుఖ్వీందర్ సింగ్ తో ఇప్పటికే పార్టీ పెద్దలు మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆ ఆరుగు ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తోంది.ఈ ఆరుగు ఎమ్మెల్యేలు పార్టీ మారితే ప్రభుత్వం మైనార్టీలో పడే ప్రమాదం ఉండడంతో ముందుగానే సుఖ్వీందర్ సింగ్ రాజీనామా చేసినట్లు సమాచారం. ఈ రోజు సాయంత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమై కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
బీజేపీ సీనియర్ నేత, హిమాచల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జైరాం ఠాకూర్, పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిశారు. ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు పాలించే ఆదేశాన్ని కోల్పోయారని పేర్కొంటూ వారు బలపరీక్షను కోరారు. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్ విజయం సాధించారని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కొనసాగే నైతిక హక్కును కోల్పోయిందని జైరాం ఠాకూర్ అన్నారు.












Click it and Unblock the Notifications