ఆకస్మిక వరదలు: మునిగిన ఆధ్యాత్మిక క్షేత్రం: నాటి ఉత్తరాఖండ్ ప్రళయం తరహాలో
సిమ్లా: ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతోన్నాయి. ఆకస్మిక వరదలకు దారి తీస్తోన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తోన్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో కురిసిన భారీ వర్షాలు జన జీవనాన్ని స్తంభింపజేశాయి. హిమాలయ పర్వతసానువుల్లోని మాంఝీ నది ఒక్కసారిగా పోటెత్తింది. దీని ప్రభావంతో హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఆకస్మిక వరదలు సంభవించాయి. 24 గంటలుగా కురిసిన భారీ వర్షాల వల్ల పోటెత్తిన మాంఝీ నది ధర్మశాలను ముంచెత్తింది.
Still no match to the rage of England football fans!
— Unaccompanied Thinking (@foolsmanual) July 12, 2021
హిమాచల్ ప్రదేశ్‌లో సుమారు నెలరోజులుగా అడపాదడపా వర్షాలు కురుస్తోన్నాయి. వాటి తీవ్రత మరింత పెరిగింది. 48 గంటలుగా ఏకధాటిగా భారీ వర్షాలు కురిశాయి. దీనితో మాంఝీ నదిలోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. వరద తీవ్రత మరింత పెరగడంతో నది పోటెత్తింది. ప్రఖ్యాత బౌద్ధ పుణ్యక్షేత్రం ధర్మశాలను ముంచెత్తింది. ధర్మశాల సమీపంలోని భాగ్‌సు నాగ్ ప్రాంతంపై విరుచుకుపడింది. ఆకస్మిక వరదతో భాగ్‌సు నాగ్ మొత్తం వరద నీటితో నిండిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

కార్లు కొట్టుకునిపోయాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నాటి ఉత్తరాఖండ్ ప్రళయాన్ని గుర్తుకు తెచ్చింది. భారీ వర్షాల వల్ల హిమచాల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడుతోన్నాయి. సిమ్లా జిల్లాలోని రామ్‌పూర్ ఏరియా ఝాక్రీ వద్ద కొండ చరియలు విరుచుకుపడటంతో జాతీయ రహదారి మూసుకుపోయింది. ఫలితంగా వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. కొండచరియలను తొలగిస్తోన్నాయి.
I think its old video
— TUSHAR AGARWAL (@tushara46532521) July 12, 2021
అటు జమ్మూకాశ్మీర్‌లోనూ భారీ వర్షాల వల్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. గండెర్బల్ జిల్లాలోని వాట్లర్ ఏరియాలో బురద పేరుకుపోయింది. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ కేంద్రం అధికారులు రెడ్ అలర్ట్‌ను జారీ చేశారు. వచ్చే మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. పాల్‌ఘర్, ముంబై, థానేల్లోనూ ఈ నెల 15వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ మూడు జిల్లాల కోసం ఆరెంజ్ అలర్ట్‌ను వాతావరణ కేంద్రం అధికారులు జారీ చేశారు.
Recommended Video
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications