కొండచరియలు విరిగిపడి 11 మంది మృతి.. ప్రధాని మోడీ సంతాపం..
హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ జిల్లాలోని నిగుల్సేరిలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 11 మంది చనిపోయారు. తొలుత మొత్తం మంది ప్రయాణికులు చనిపోయారని వార్తలు వచ్చినా.. 14 మందిని రక్షించామని అధికారులు తెలియజేశారు. కానీ ఇప్పటికీ 20-25 మంది గల్లంతు అయ్యారని తెలుస్తోంది. రెకాంగ్ పియో, రాంపూర్ మధ్య జాతీయ రహదారి పక్కన కొండచరియలు ఒక్కసారిగా విరిగి పడిపోవడంతో రోడ్డు కూడా భారీగా కుంగిపోయింది. జాతీయ రహదారిపై ఉన్న ప్రయాణికుల బస్సుతో పాటు పలు వాహనాలు ఇందులో పడిపోయాయి. వెలికితీత చర్యలు చేపట్టారు.
కిన్నౌర్ లో కొండచరియలు విరిగిపడిన ఘటన తర్వాత భారీగా బండరాళ్లు కూడా పడ్డాయి. దీంతో అప్పటికే కొండపై నుంచి బడిన బస్సుతో పాటు ఇతర వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి. ప్రమాదం రాత్రి జరగడంతో సహాయక చర్యలు ఇబ్బందిగా మారింది.

ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో ఆ భగవుంతుడు ఫ్యామిలీలకు మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. వెంటనే సీఎం ఠాకూర్‌తో మాట్లాడారు. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. తర్వాత హోం మంత్రి అమిత్ షా.. సీఎం ఠాకూర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పోలీసులు, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. రెస్క్యూ కోసం హెలికాప్టర్ కూడా వినియోగిస్తున్నామని ఠాకూర్ తెలిపారు. మృతుల్లో ఐదుగురు మహిళలు.. రెండేళ్లి చిన్నారి కూడా ఉన్నారు.
Recommended Video
గతనెల 25వ తేదీన కూడా ఇలాంటి ప్రమాదం జరిగింది. కొండచరియలు విరిగిపడి 9 మంది చనిపోయారు. ముగ్గురు గాయపడ్డారు. 27వ తేదీన లాహౌల్ స్పిట్ జిల్లాలో కూడా కొండచరియలు విరిగిపడగా 8 మంది చనిపోగా.. ఇద్దరు గాయపడ్డారు. ఇప్పడు మరో 11 మంది చనిపోయారు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications