Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటన : మృతురాలు డా. దీపా శర్మ మరణానికి ముందు షాకింగ్ ట్వీట్ !!

హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లా సంగాల్ లోయలో కొండ చరియలు విరిగిపడి ఢిల్లీకి చెందిన తొమ్మిది మంది పర్యాటకులు మృతి చెందిన దారుణ ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన దారుణ ఘటనలో మృతి చెందిన తొమ్మిది మందిలో ఒకరైన డాక్టర్ దీపా శర్మ తాను మృతి చెందడానికి 25 నిమిషాల ముందు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. మరణానికి ముందు ఆమె పోస్ట్ లు అందరినీ షాక్ కి గురి చేస్తున్నాయి. ప్రకృతి గురించి ఆమె చేససిన పోస్ట్ వైరల్ గా మారింది.

ప్రకృతి తల్లి లేని జీవితం వ్యర్థమని దీపా శర్మ ట్వీట్

ప్రకృతి తల్లి లేని జీవితం వ్యర్థమని దీపా శర్మ ట్వీట్

ఆదివారం మధ్యాహ్నం 12.59 గంటలకు జైపూర్‌కు చెందిన 34 ఏళ్ల దీపా శర్మ హిమాచల్ ప్రదేశ్‌లోని నాగస్తి పోస్టులో తన ఫోటోను ట్వీట్ చేశారు. ఆ తర్వాత కాసేపటికే ఆమె మృతి చెందారు.ఆ ట్వీట్ లో తాను పౌరులు అనుమతించబడే భారతదేశం యొక్క బోర్డర్లో నిలబడి ఉన్నారు. ఈ పాయింట్ దాటి, 80 కిలోమీటర్ల దూరంలో, టిబెట్‌తో చైనా సరిహద్దును కలిగి ఉంది, ఇక ఈ ప్రాంతాన్ని చైనా చట్టవిరుద్ధంగా ఆక్రమించింది అంటూ పోస్ట్ చేశారు. అంతకు ముందు ఒక పోస్ట్ లో ప్రకృతి తల్లి లేని జీవితం వ్యర్థమని, ప్రకృతిలో పరవశిస్తూ తాను సంతోషంగా ఉన్న ఫోటోలు ట్వీట్ చేశారు.

వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడటంతో దీపా శర్మ మృతి

వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడటంతో దీపా శర్మ మృతి

ఆ తర్వాత మధ్యాహ్నం 1.25 గంటలకు వర్షాల కారణంగా కొండ చరియలు విరిగి పడిన ఘటనలో దీప శర్మ మృతి చెందారు. హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ జిల్లాలోని చిట్కుల నుండి సాంగ్లా వరకు పర్యాటకులను తీసుకెళ్లే టెంపో ట్రావెలర్ పై భారీ బండరాళ్లు పడడంతో తొమ్మిది మంది మరణించిన దుర్ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. ప్రకృతిని ప్రేమించిన దీప శర్మ ప్రకృతి వైపరీత్యం కారణంగా మృతి చెందడం చాలా మందిని షాక్ కు గురి చేస్తుంది.

ప్రకృతి ప్రేమికురాలు దీపా శర్మ .. మరణానికి ముందు ప్రకృతి గురించి పోస్ట్

దీపా శర్మ ఆయుర్వేద వైద్యురాలు, క్లినికల్ న్యూట్రిషనిస్ట్ మరియు రచయిత అని ఆమె ట్విట్టర్ బయో ద్వారా తెలుస్తుంది. ఆమెకు ఫోటోగ్రఫీ, ప్రయాణం మరియు కొత్త వ్యక్తులను కలవడం చాలా ఇష్టమని ఆమె వ్యక్తిగత వెబ్‌సైట్ పేర్కొంది. కొండచరియలు విరిగిపడిన ఘటనను ప్రాణాలు కోల్పోయే ముందు రోజు, కొండలలో తన ఫోటోను ట్వీట్ చేస్తూ ఆమె చేసిన ట్వీట్ ప్రకృతి ప్రేమికులకు సంతోషాన్ని కలిగిస్తున్నా, ప్రకృతి వైపరీత్యంతో ఆమె మరణం అందరికీ అంతే బాధను కలిగిస్తుంది. ప్రకృతి లేనిదే మనం లేమని చెప్పిన ఆమె అదే ప్రకృతిలో కలిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటనలో దీపా శర్మతో పాటు మృతులు వీరే


హిమాచల్ ప్రదేశ్ కొండచరియలో ప్రాణాలు కోల్పోయిన మిగతా ఎనిమిది మందిని మాయదేవి బియానీ (55), ఆమె కుమారుడు అనురాగ్ బియానీ (31), రాజస్థాన్ లోని సికార్ కు చెందిన కుమార్తె మాయ దేవి బియానీ (25), ప్రతీక్ష సునీల్ పాటిల్ (27) మహారాష్ట్ర, అమోగ్ బాపట్ (27), చత్తీస్ గడ్ కు చెందిన సతీష్ కటక్‌బార్ (34), పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఉమ్రావ్ సింగ్ (42), కుమార్ ఉల్హాస్ వేదపాఠక్ లు ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+