అదానీని కూల్చబోయి సొంత పతనం రాసుకున్న హిండెన్ బర్గ్-మూసివేత ప్రకటన..!

ఒకప్పుడు తన సంచలన అధ్యయన నివేదికలతో భారత్ లో బిలియనీర్ సంస్ధ అదానీ గ్రూప్ ను దెబ్బతీసేందుకు ప్రయత్నించి విఫలమైన అమెరికా పెట్టుబడులు, పరిశోధన సంస్థ హిండెన్ బర్గ్ రీసెర్చ్ అనూహ్యంగా మూతపడనుంది. షార్ట్ సెల్లింగ్ స్పెషలిస్ట్ గా పేరున్న హిండెన్ బర్గ్ రీసెర్చ్ గత కొన్నేళ్లలో చేసిన అధ్యయనాలు, నివేదికలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. ఎన్నో ఏళ్లుగా కుబేరులు పోగేసుకున్న భారీ సంపదను ఆవిరయ్యేలా చేసాయి. అయితే వీటి వెనుక ఉన్న కుట్రలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో ఆ సంస్థ మూసేయక తప్పడం లేదు.

2017లో ప్రారంభమైన హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ 2023లో భారత్ కేంద్రంగా పనిచేస్తున్న అదానీ గ్రూప్ షార్ట్ సెల్లింగ్ కు పాల్పడి ఖాతాదారుల్ని మోసం చేస్తోందంటూ ఇచ్చిన రిపోర్ట్ ఆ సంస్థ షేర్లను భారీగా పతనం అయ్యేలా చేసింది. విపక్షాలకు అదానీ గ్రూప్ టార్గెట్ అయ్యేలా చేసింది. అలాగే సీబీఐ దర్యాప్తులకు, సుప్రీంకోర్టు విచారణలకు కారణమైంది. చివరికి విదేశీ సంస్థలు ఇచ్చే నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటూ పోతే భారత్ లో సంస్థలు మనుగడ సాగించలేవని సుప్రీంకోర్టు పిటిషన్లను తోసిపుచ్చింది. దీంతో అదానీ గ్రూప్ కు బిగ్ క్లీన్ చిట్ లభించినట్లయింది.

Hindenburg research to wind up soon once given controversial report on adani group

హిండెన్ బర్గ్ ను మూసేస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ సంచలన ప్రకటన చేశాడు. అలాగే తన ప్రకటన వెనుక ఉన్న కారణాలను కూడా వెల్లడించాడు. తనకు ఎలాంటి బెదిరింపులు రాలేదని, తనపై ఎలాంటి ఒత్తిడి లేదని, పెద్దగా వ్యక్తిగత సమస్యలు కూడా లేవని అండరన్స్ తెలిపాడు. అయితే ప్రపంచంలో చాలా మందిని, తాను శ్రద్ధ వహించే వ్యక్తులను కోల్పోవడం వెనుక తీవ్రత తన దృష్టి వచ్చిందని పేర్కొన్నాడు.

తాను ఇప్పుడు హిండెన్‌బర్గ్‌ని తన జీవితంలో ఓ అధ్యాయంగా చూస్తున్నట్లు తెలిపాడు. తనను నిర్వచించే ప్రధాన విషయంగా కాదని వెల్లడించాడు. చివరిగా అండరన్స్ పోంజీ స్కీమ్‌లపై చిట్కాలను రెగ్యులేటర్‌లకు అందించిన తర్వాత తన సంస్థను మూసేయాలని నిర్ణయించుకున్నాడు. అలాగే రాబోయే కాలంలో హిండన్ బర్గ్ గతంలో పరిశోధనలు ఎలా నిర్వహించిందో తమ మోడల్ అందరికీ తెలిసేలా వీడియోలు చేస్తానని చెప్పుకొచ్చాడు.

అయితే హిండెన్ బర్గ్ చరిత్ర చూస్తే 2017లో ప్రారంభమైన ఈ సంస్థ ఏడేళ్లలో తన సొంత పతనాన్ని లిఖించుకుంది. భారత్ కేంద్రంగా మొదలై దేశ దేశాలకు విస్తరించిన అదానీ గ్రూప్ పై అమెరికా అండతో కక్షగట్టి, అధ్యయనం పేరుతో అడ్డగోలు రిపోర్టులు ఇచ్చి కోట్లాది మంది పెట్టుబడిదారుల సంపదను ఆవిరి చేసిన హిండెన్ బర్గ్ చివరికి మూతపడుతోంది. తద్వారా తన గోయి తానే తీసుకుంది. హిండెన్ బర్గ్ మూసివేతకు దాని వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ వ్యక్తిగత కారణాలు చూపినా, అమెరికాలో మారుతున్న ప్రభుత్వమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (OCCRP) తరహాలోనే హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కూడా ఎవరో రాజకీయ లక్ష్యాల కోసం పనిచేస్తున్న జార్జ్ సోరోస్ తరహాలోనే డీప్ స్టేట్ టూల్ గా పనిచేసిందనే ఆరోపణలు ఉన్నాయి. స్వతంత్ర పరిశోధనల ముసుగులో విదేశీ ఆర్థిక వ్యవస్థలలో ఆర్థిక అస్థిరతను సృష్టించేందుకు బైడెన్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఇలాంటి సంస్ధలకు మద్దతు ఇచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. అంతే కాదు హిండెన్‌బర్గ్ నివేదికలు మార్కెట్లను ఎప్పటికప్పుడు పతనం దిశగా నడిపించాయి.పెట్టుబడిదారుల నమ్మకాన్ని పొగొట్టాయి. వివిధ దేశాల ఆర్ధిక వ్యవస్థలను కుప్పకూల్చాయి. చివరికి ఈ నివేదికల వల్ల అదానీ వంటి దిగ్గజానికి ఏమీ కాకపోగా.. హిండెన్ బర్గ్ సంస్ద మూతపడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+