Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

థాక్రే బ్రదర్స్ ను మళ్లీ కలుపుతోన్న హిందీ భాష-మహారాష్ట్రలో ఏం జరుగుతోంది ?

మహారాష్ట్ర రాజకీయాల్లో గత పదేళ్లుగా ఊహించని పరిణామాలు ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. అధికారం కోసం పార్టీలు, విధేయతలు మార్చేసే రాజకీయ నాయకులు, కూటములు కట్టే నేతలు, సొంత పార్టీల్ని చీల్చేందుకు సైతం వెనుకాడని చాణుక్యులు ఎంతో మందిని చూస్తూనే ఉన్నాం. కానీ వీటిన్నింటికీ మించిన రాజకీయ పరిణామం మరొకటి చోటు చేసుకోబోతోంది. అదే రెండు దశాబ్దాల క్రితం విడిపోయిన థాక్రే సోదరులు ఉద్దవ్, రాజ్ తిరిగి ఏకమవుతుండటం.

మహారాష్ట్రలో ప్రత్యేకంగా ముంబైలో మరాఠా స్దానికత నినాదంతో మూడు దశాబ్దాల పాటు ఇక్కడి రాజకీయాల్ని శాసించి, ఒక్క సారి కూడా పదవి తీసుకోని నేత బాల్ థాక్రే. ఆయన వారసుడిగా ఎవరుండాలనే విషయంలో సొంత కుటుంబంలోనే విభేధాలు తలెత్తాయి. బాల్ థాక్రే కుమారుడు ఉద్ధవ్ థాక్రేకూ, సోదరుడి కుమారుడు అయిన రాజ్ థాక్రేకు మాధ్య విభేదాలు వచ్చాయి. వీరిద్దరిలో ఎవరిని తన వారసుడిగా ప్రకటించాలన్న చర్చ వచ్చినప్పుడు నెమ్మదస్తుడిగా పేరున్న తన కుమారుడు ఉద్ధవ్ వైపే బాల్ థాక్రే మొగ్గుచూపారు. ఈ నిర్ణయం థాక్రేల కంచుకోటకు బీటలు వారేందుకు బీజాలు వేసింది.

hindi language re-uniting Thackeray brothers uddhav and raj after two decades-here is how

బాల్ థాక్రే నిర్ణయంతో శివసేనాధిపతిగా ఉద్ధవ్ థాక్రే అవతరిస్తే, ఆ పార్టీ నుంచి విడిపోయిన రాజ్ థాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పేరుతో కొత్త పార్టీ పెట్టుకున్నారు. అయితే బాల్ థాక్రే వారసత్వంతో క్రమంగా ఎదిగిన ఉద్ధవ్ థాక్రే.. బీజేపీతో కలిసి పలుమార్లు మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయగలిగారు. అయితే సీఎం కాలేకపోయారు. బీజేపీ అత్యాశను గమనించి ఆ తర్వాత ఆ పార్టీతో బంధానికి గుడ్ బై చెప్పేసిన ఉద్ధవ్ థాక్రే.. ఆగర్భ శత్రువులైన కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి మహావికాస్ అఘాడీ పేరుతో మరో కూటమి తయారు చేసి సీఎం సీటుపై కూర్చున్నారు.

అయితే ఈసారి ఉద్ధవ్ థాక్రే తీసుకున్న నిర్ణయం సొంత పార్టీ శివసేన లో ఏక్ నాథ్ షిండే వంటి వారికి గిట్టలేదు. మరాఠా వాదంతో రాజకీయాలు చేసి కాంగ్రెస్ ను తీవ్రంగా వ్యతిరేకించిన బాల్ థాక్రే పార్టీ తిరిగి అదే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం జీర్ణించుకోలేకపోయిన ఏక్ నాథ్ షిండే అసంతృప్తిని గమనించిన బీజేపీ ఆయన్ను తనవైపు తిప్పుకుంది. అదే సమయంలో మరో మిత్రపక్షం ఎన్సీపీలోనూ అజిత్ పవార్ వర్గాన్ని తమవైపు తిప్పుకుని ఉద్ధవ్ ప్రభుత్వాన్ని కూల్చేసింది.

hindi language re-uniting Thackeray brothers uddhav and raj after two decades-here is how

చివరికి ప్రజా తీర్పుకు వెళ్లినా ఉద్ధవ్ థాక్రేకు, అలాగే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూ ఊరట దక్కకుండా పోయింది. కోర్టుల్లోనూ అసలైన శివసేన, ఎన్సీపీ పార్టీలు,గుర్తుల విషయంలో వీరిద్దరికీ ఊరట దక్కలేదు. దీంతో సైలెంట్ గా ఉంటున్న ఉద్ధవ్ థాక్రేకు తాజాగా దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం భారీ అస్త్రం ఇచ్చింది. మహారాష్ట్ర స్కూళ్లలో హిందీ భాషను తప్పనిసరి చేయాలన్న మహా సర్కార్ నిర్ణయం మరాఠా అజెండాతో ఎదిగిన థాక్రేలకు మంచి ఛాన్స్ లా మారింది.

దీంతో ఉద్ధవ్ థాక్రేతో పాటు రాజకీయాల్లో వరుసగా విఫలమవుతున్న అతని కజిన్ రాజ్ థాక్రే ఇప్పుడు హిందీ భాషను తప్పనిసరి చేసే విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంతే కాదు వీరిద్దరూ తిరిగి కలిసి పనిచేసేందుకు కూడా సిద్దమైపోయారు. తమ మధ్య ఉన్నవి చిన్నా చితకా విభేదాలే అని, మళ్లీ కలిసి పనిచేసేందుకు సిద్దమని కూడా ప్రకటించేస్తున్నారు. అయితే రాజ్ థాక్రే చంచల మనస్తత్వం తెలిసిన ఉద్ధవ్.. రోజుకో రకంగా మాట మార్చకుండా కలిసి పనిచేస్తానంటే రమ్మని షరతు పెడుతున్నారు. దీనికి అంగీకరించి త్వరలోనే ఉద్ధవ్, రాజ్ థాక్రేలు ఒక్కటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Take a Poll

అదే సమయంలో అధికార మహాయుతి కూటమితో పాటు ఉద్ధవ్ భాగస్వామిగా ఉన్న మహా వికాస్ అఘాడీ సైతం థాక్రే సోదరుల తిరిగి కలయికను స్వాగతిస్తున్నాయి. వీళ్లిద్దరూ కలవడం వల్ల తమకు ఎలాంటి నష్టం లేదని అధికార కూటమి భావిస్తుండగా.. వీరిద్దరూ కలిస్తే అయినా రాష్ట్రంలో మ్యాజిక్ జరిగి అధికారంలోకి వస్తామన్న ధీమాతో విపక్ష కూటమి ఉంది. త్వరలో జరిగే మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నిక్లలో ధాక్రే సోదరులు కలిసి పనిచేస్తే అధికార బీజేపీ-శివసేన-ఎన్సీపీ కూటమికి కష్టాలు తప్పకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+