ముస్లిం డ్రైవర్ కోసం... హిందూ అధికారి రంజాన్ ఉపవాసం...!
దేశంలో మెజారీటీ ప్రజలు కులమతాల పట్టింపుల్లో కొట్టుకు పోతుంటారు.అయితే అందులో కొంతమంది పరమత సహనం పాటిస్తారు. మతాల కంటే ముందుగా మానవత్వం ఉందని నిరూపిస్తారు. తమ తోటీ వారికి కష్టమస్తే వారు ఏమతం వారని చూడకుండా వ్యవహరిస్తారు. ఇలాంటీ సంఘటనలు దేశంలో అనేకం ఉన్నా.. ..తాజగా మహారాష్ట్ర్రాలోని ఓ హిందూ ప్రభుత్వ అధికారి తన వద్ద పని చేసే ముస్లిం డ్రైవర్ కోసం రోజాను పాటిస్తున్నాడు.

డ్రైవర్ కోసం రంజాన్ ఉపవాసం
మహారాష్ట్ర్రాలో హిందుమతానికి చెందిన సంజయ్ ఎన్ మలీ బుల్దాన ఫారెస్ట్ డివిజనల్ అధికారిగా కొనసాగుతున్నాడు. అయితే తన వద్ద జాఫర్ అనే ఉద్యోగి డ్రైవర్‌గా కొనసాగుతున్నాడు. కాగా రంజాన్ మాసం వచ్చిన నేపథ్యంలో ముస్లింలు రంజాన్ ఉపవాస దీక్షలను కొనసాగించే విషయం తెలిసిందే..అయితే మలీ వద్ద పనిచేసే డ్రైవర్ జాఫర్ మాత్రం రంజాన్ దీక్షను చేపట్టలేదు. దీంతో దీక్షను చేపట్టమని మలీ ఆయనకు చెప్పాడు. కాని డ్రైవర్ గా ఉద్యోగం చేస్తున్న నేపథ్యంలో ప్రస్థుతం ఆరోగ్యపరంగా శరీరం సహకరించడం లేదని ఇక ఉపవాస దీక్షలు చేయడం వల్ల మరింత అనారోగ్యం తలెత్తే అవకాశం ఉందని చెప్పారు.

నెల రోజులుగా రంజాన్ ఉపవాసాన్ని కొనసాగిస్తున్న హిందూ అధికారి
కాగా జాఫర్ తన వద్ద ఉద్యోగం చేస్తుండడంతో ఆయనకు బదులుగా తాను ఉపవాస దీక్ష చేస్తానని డీఎఫ్ఓ చెప్నాడు. ఈ నేపథ్యంలోనే మే 6 నుండి రంజాన్ ఉపవాస దీక్షలు చేస్తున్నట్టు చెప్పాడు. ఇలా ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచి సాయంత్రం వరకు రంజాన్‌లో భాగంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను చేపడుతున్నట్టు వివరించాడు.కాగా రంజాన్ ఉపవాస దీక్షలు చేపట్టిన తర్వాత చాల సంతోషంగా ఉన్నానని ఆయన తెలిపారు.

మతాలకంటే మానవత్వమే మిన్నా....
ఇక మతాలకంటే ముందు మానవత్వానికే ఎక్కువ విలువ ఇవ్వాలని ఈ సంధర్భంగా మీడీయాతో చెప్పాడు.ప్రతి మతం కూడ మంచి విషయాలనే చెబుతుందని తాను నమ్ముతానని అన్నాడు.కాగా మతసామరస్యాన్ని పెంపోందించే విధంగా ప్రభుత్వాలతోపాటు ప్రజలు పలు కార్యక్రమాలు చేయానలి ఆయన కోరారు.కాగ ఈసంవత్సరం ఎక్కువ కాలం పాటు రంజాన్ దీక్ష రోజులు రానున్నాయి. దీంతో జూన్ మొదటీ వారంవరకు రంజాన్ ఉపవాసాలు కొనసాగనున్నాయి.












Click it and Unblock the Notifications