Adipurush: ఆదిపురుష్ సినిమాపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్.. ఎందుకంటే..!
ప్రభాస్, కృతి సనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన మైథలాజికల్ చిత్రం ఆదిపురుష్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలోని రావణుడు, రాముడు, సీతాకు సంబంధించిన కొన్ని 'అభ్యంతరకర సన్నివేశాలను' తొలగించాలని కోరుతూ హిందూ సేన జాతీయ అధ్యక్షుడు ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. రామాయణంలో కనిపించే మతపరమైన పాత్రల వర్ణనలకు విరుద్ధమైన దృశ్యాలు ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.
"రాముడు, సీత, హనుమంతుని చిత్రం, ఏదైనా మార్పు/విక్షేపం గురించి హిందువులకు ప్రత్యేక దృష్టి ఉంటుంది. సినిమా నిర్మాతలు, దర్శకులు, నటీనటుల ద్వారా వారి దైవ ప్రతిమ వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుంది'' అని పిటిషన్‌లో తెలిపారు. సినిమాలోని సన్నివేశాలు మతపరమైన పాత్రలు హిందూ నాగరికత, హిందూ మత మూర్తులు, విగ్రహాలను అవమానించేలా చూపించాయని వారు ఆరోపించారు.

ఈ మూవీ హిందువుల మనోభావాల్ని దెబ్బతీసిందని చెప్పారు. హిందువులకు పవిత్రమైన ఇతిహాస రామాయణాన్ని హేళన చేసేలా ఉందంటూ హిందూసేన అభ్యంతరం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలో, అలాగే తులసీదాస్ రచించిన రామచరితమానస్‌లోనూ ప్రధాన పాత్రల వర్ణనకు.. ఆదిపురుష్‌లో పాత్రలను చూపించిన తీరుకు చాలా తేడాలు ఉన్నాయన్నారు.
ఈ సినిమాలనో అభ్యంతరకర సన్నివేశాలను తొలగించేలా చిత్ర బృందాన్ని ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. రావణుడి పాత్రను గడ్డంతో క్రూరంగా చూపించారని చెప్పారు. ఇది సరైంది కాదన్నారు. హిందూ సంస్థలు, అయోధ్య రామాలయ ప్రధాన పూజారి పురాణ పాత్రల చిత్రీకరణపై అభ్యంతరం వ్యక్తం చేయగా, సినిమా నిర్మాతలు ఎటువంటి మతపరమైన సెంటిమెంట్‌లు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications