దేశంలో హిందువులకూ మైనార్టీ హోదా ఇవ్వొచ్చు-సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
భారత్ లో మెజారిటీ జనాభాగా ఉన్న హిందువులకు మైనార్టీ హోదా ఇవ్వొచ్చా లేదా అన్న దానిపై సుప్రీంకోర్టులో ఆసక్తికరవాదనలు సాగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో హిందువుల జనాభా తక్కువగా ఉన్న నేపథ్యంలో వారికి మైనార్టీ హోదా ఇవ్వాలన్న డిమాండ్లు ఉన్నాయి. దీనిపై తాజాగా సుప్రీంకోర్టుకు కేంద్రం తన అభిప్రాయం తెలిపింది.
జనాభా పరంగా హిందువులు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో వారికి ఆయా రాష్ట్రాలు మైనార్టీ హోదా ఇవ్వొచ్చని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. మైనార్టీలకు తమ జనాభా ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో సొంతంగా విద్యాసంస్ధలు ఏర్పాటు చేసేందుకు, నిర్వహించేందుకు రాజ్యాంగం అనుమతిస్తోంది. ఈ నేపథ్యంలో హిందువుల జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రాలు వారికి మైనార్టీ హోదా కల్పించడం ద్వారా విద్యాసంస్ధలు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించవచ్చని కేంద్రం తెలిపింది.

ఓ రాష్ట్రంలో జనాభా, భాష పరంగా మైనార్టీలుగా ఉన్న వారు విద్యాసంస్ధలు ఏర్పాటు చేసుకునేందుకు విద్యాచట్టం ప్రకారం అనుమతించే అధికారం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని సుప్రీంకోర్టులో కేంద్రం వాదించింది. ఉదాహరణకు జమ్మూ, కశ్మీర్, మిజోరం, నాగాలాండ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, లక్షద్వీప్, మణిపూర్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో హిందువుల జనాభా తక్కువగా ఉంది. అయితే వారికి అక్కడ మైనార్టీలుగా గుర్తించకపోవడంతో విద్యాసంస్ధలు నెలకొల్పే వీల్లేకుండా పోతోంది. దీనిపై దాఖలైన ఓ ప్రజాప్రయోజన వాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా పిటిషనర్ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ కేంద్రం దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. దీంతో కేంద్రం తమ అభిప్రాయం చెప్పింది.












Click it and Unblock the Notifications