వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

8 నెలల చిన్నారికి హెచ్ఐవీ బ్లడ్ ; ప్రాణాపాయంలో చిన్నారి ; విచారణకు ఆదేశించిన మహా సర్కార్ !!

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో అభం శుభం తెలియని ఓ ఎనిమిది నెలల చిన్నారికి హెచ్ఐవి పాజిటివ్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. అకోలా జిల్లాలో ఎనిమిది నెలల చిన్నారికి హెచ్‌ఐవి సోకిన రక్తం ఎక్కించినట్టు గుర్తించిన మహారాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని స్థానిక ఆరోగ్య అధికారులను కోరినట్లు ప్రజారోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే తెలిపారు ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ఘటనకు కారకులపై చర్యలకు ఉపక్రమించింది.

చెత్తకుప్పలో పసికందు మృతదేహం..తల్లి ఇంటర్ చదివే మైనర్ బాలిక ? ఈ పాపం ఎవరిది ?చెత్తకుప్పలో పసికందు మృతదేహం..తల్లి ఇంటర్ చదివే మైనర్ బాలిక ? ఈ పాపం ఎవరిది ?

అకోలా జిల్లాలో దారుణం .. ఓ చిన్నారికి హెచ్ఐవీ రక్తం ఎక్కించిన వైద్యులు

అకోలా జిల్లాలో దారుణం .. ఓ చిన్నారికి హెచ్ఐవీ రక్తం ఎక్కించిన వైద్యులు

అసలేం జరిగిందంటే మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో ఓ చిన్నారికి రెండు నెలల క్రితం తెల్లరక్తకణాల సంఖ్య పడిపోవడంతో వైద్యుని సూచనల మేరకు అకోలాలోని ఒక బ్లడ్ బ్యాంక్ నుండి రక్తాన్ని తప్పించి చిన్నారికి ఎక్కించారు. ఆ తర్వాత చిన్నారి కోలుకున్నప్పటికీ, తర్వాతి కాలంలో క్రమక్రమంగా చిన్నారి తరచూ అనారోగ్యానికి గురికావడంతో చిన్నారిని అమరావతిలోని ఓ ఆసుపత్రిలో చూపించారు. పాపకు వేరే అనారోగ్య లక్షణాలు లేకపోవడంతో అనుమానం వచ్చిన వైద్యులు, పాపకు హెచ్ఐవి టెస్ట్ చేయించగా హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది.

 పాపకు హెచ్ఐవీ పాజిటివ్ .. తల్లిదనృలకు నెగిటివ్ .. బ్లడ్ బ్యాంక్ పై అనుమానం

పాపకు హెచ్ఐవీ పాజిటివ్ .. తల్లిదనృలకు నెగిటివ్ .. బ్లడ్ బ్యాంక్ పై అనుమానం

దీంతో పాప కుటుంబసభ్యులు షాక్ తిన్నారు.ఇక హెచ్ఐవి సోకిన పాప తల్లిదండ్రులకు పరీక్షలు నిర్వహించగా వారికి హెచ్ఐవి నెగిటివ్ వచ్చింది. దీంతో పాపకు హెచ్ఐవీ ఎలా సోకింది అన్న దానిపై తల్లిదండ్రులతో మాట్లాడిన వైద్యులకు గతంలో తెల్ల రక్త కణాలు తక్కువగా ఉండటంతో రక్తం ఎక్కించిన విషయాన్ని వైద్యుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వైద్యులు బ్లడ్ బ్యాంక్ నుండి బ్లడ్ సేకరించిన సిబ్బంది నిర్లక్ష్యం వల్లే పాప హెచ్ఐవి పాజిటివ్ బారిన పడింది అని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ ఘటనపై, బ్లడ్ బ్యాంక్ నిర్వాహకుల నిర్లక్ష్యంపై మహారాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇదే విషయాన్ని మహా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే వెల్లడించారు.

విచారణకు ఆదేశించిన మహా సర్కార్

విచారణకు ఆదేశించిన మహా సర్కార్

తాము పాపకు హెచ్ఐవి రక్తం ఎక్కించిన ఘటనపై విచారణకు ఆదేశించామని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటాం అని పేర్కొన్నారు. ఈ అజాగ్రత్త చిన్నారి జీవితాన్ని ప్రమాదంలో పడేసినందున ఈ ఘటనకు బాధ్యులైన ఎవరిని వదిలేది లేదని అని జల్నాలో విలేకరులతో అన్నారు. ఏది ఏమైనా రక్తాన్ని నిల్వ చేసే బ్లడ్ బ్యాంకులలో, రక్తాన్ని స్వీకరించే ముందు అన్ని పరీక్షలూ నిర్వహించాల్సిన అవసరం ఉంది. హెచ్ఐవి తో సహా అనేక పరీక్షలు చేసిన తరువాత, రక్తం ఇచ్చే వారు ఆరోగ్యంగా ఉంటేనే ఆ బ్లడ్ ను తీసుకోవాల్సి ఉంటుంది. ఇది బ్లడ్ బ్యాంకుల నిర్వహణలో కచ్చితంగా పాటించవలసిన నిబంధన.

Recommended Video

Car plummets into sinkhole formed after excessive rain in Mumbai's Ghatkopar | Oneindia Telugu
 బ్లడ్ బ్యాంక్ పనితీరుపై దర్యాప్తు .. ప్రమాదంలో పాప ప్రాణం !!

బ్లడ్ బ్యాంక్ పనితీరుపై దర్యాప్తు .. ప్రమాదంలో పాప ప్రాణం !!

కానీ హెచ్ఐవి పాజిటివ్ ఉన్న బ్లడ్ శాంపిల్ ను సదరు బ్లడ్ బ్యాంక్ ఎందుకు గుర్తించలేకపోయింది. పరీక్షలు నిర్వహించలేదా లేక నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లుగా సంబంధిత అధికారులు వెల్లడిస్తున్నారు. ఏది ఏమైనా ఒక చిన్న నిర్లక్ష్యం ఒక చిన్నారి ప్రాణానికే ప్రమాదంగా మారింది. హెచ్ఐవి బాధితురాలిగా మార్చింది. ఇప్పుడు ఆ బాలిక భవిష్యత్తు పై తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బ్లడ్ బ్యాంకు ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని, ప్రజల ప్రాణాలను రక్షించాలని బాధిత చిన్నారి తరపు బంధువులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.

English summary
In Maharashtra, an eight-month-old child was transfused with HIV-positive blood. The Maharashtra government has ordered an inquiry into the discovery of an HIV-infected blood transfusion for an eight-month-old baby in Akola district. Public Health Minister Rajesh Tope said he had asked local health officials to submit a report within three days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X