చెన్నెలో చైనా వైరస్..రెండు కేసులు నమోదు

HMPV VIRUS: చైనాలో పురుడుపోసుకున్న మెటాన్యుమోవైరస్ (HMPV) భారత్‌లో క్రమంగా విస్తోరిస్తోంది. కోరలు చాచింది. ఇప్పటికే కర్ణాటక, గుజరాత్‌లల్లో ఈ కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో రెండు, అహ్మదాబాద్‌లో ఒక హెచ్ఎంపీవీ పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇది మరింత విస్తరించింది. పొరుగు రాష్ట్రానికీ పాకిందీ వైరస్.

తాజాగా తమిళనాడులో రెండు హెచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. చెన్నై, సేలంలల్లో ఈ రెండింటినీ గుర్తించారు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు. సేలం, చెన్నైకి చెందిన ఇద్దరు చిన్న పిల్లలు ఈ వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం వారిద్దరూ వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు.

HMPV in India 2 Suspected cases reported in Tamilnadu

తొలి హెచ్ఎంపీవీ కేసు చెన్నైలోని గిండి చెట్‌పేట్‌లో నమోదైంది. ఇక్కడ నివసించే ఓ చిన్నారిలో ఈ వైరస్ లక్షణాలు కనిపించాయి. దగ్గు, జ్వరం, జలుబు, శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్న ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలను నిర్వహించారు. వాటి శాంపిల్స్‌ను పరిశీలించగా.. హెచ్ఎంపీవీగా తేలింది. మరో కేసు- సేలంలో రికార్డయింది.

దీనితో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వైరస్ వల్ల ఎలాంటి అపాయమూ లేదని పేర్కొంది. ఇదేమీ కొత్త వైరస్ కాదని, 2001లోనే తొలి కేసు నమోదైందని తెలిపింది. రెస్పిరేటరీ వైరస్ అని, చలికాలంలో జలుబు, ఫ్లూ తరహా లక్షణాలు కనిపిస్తాయని వివరించింది.

ప్రత్యేకించి- చిన్నపిల్లలు, వయోధిక వృద్ధులు దీని బారిన పడే అవకాశం ఉందని పేర్కొంది. సరైన ట్రీట్‌మెంట్ తీసుకోవడం వల్ల నయమౌతుందనీ భరోసా ఇచ్చింది. చెన్నై, సేలంలల్లో చికిత్స పొందుతున్న ఇద్దరు చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించింది.

హెచ్ఎంపీవీ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పలు మార్గదర్శకాలను జారీ చేసిన విషయం తెలిసిందే. దగ్గు, తుమ్ముతున్నప్పుడు నోటికి లేదా ముక్కుకు హ్యాండ్ కర్చీఫ్ లేదా టిష్యూ పేపర్‌ను అడ్డు పెట్టుకోవాలి. సబ్బు లేదా అల్కహాల్‌తో కూడిన శానిటైజర్‌తో తరచూ చేతులను శుభ్రపర్చుకోవాలి.

గుంపుగా ఉండే ప్రదేశాలకు వెళ్లకూడదు. అలాంటి ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్లూతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలి. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నప్పుడు బహిరంగ ప్రదేశాలకు వెళ్లకూడదు. గుంపులో తిరగకూడదు. చాలినంత మంచినీళ్లు తీసుకోవాలి. పౌష్టికాహారాన్ని స్వీకరించాలి.

అనారోగ్యం బారిన పడినప్పుడు ఇతరులను కలుసుకోవడాన్ని తగ్గించాలి. ఇంట్లోనే ఉండాలి. గాలి ధారాళంగా వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలి. కంటి నిండా నిద్రపోవాలి. ఇతరులకు షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదు. ఒకసారి వినియోగించిన టిష్యూ పేపర్లు, హ్యాండ్ కర్చీఫ్‌ను మళ్లీ వాడకూడదు.

అనారోగ్యంతో బాధపడుతున్న వారితో దూరంగా ఉండాలి. తరచూ కంటిని నలుపుకోవడం, ముక్కు, నోటిని చేత్తో తుడుచుకోవడాన్ని మానుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయకూడదు. డాక్టర్‌ను సంప్రదించకుండా సొంతంగా ఎలాంటి మెడిసిన్‌నూ వాడకూడదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+