Holiday: రేపు విద్యాసంస్థలు, బ్యాంకులకు సెలవు

భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బీఆర్. అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని ఏప్రిల్ 14, మంగళవారం నాడు దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు సెలవు ప్రకటించాయి. బాబా సాహెబ్ జన్మదినాన్ని గౌరవిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాధారణ సెలవును (General Holiday) అమలు చేస్తున్నాయి.

ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు.. కళాశాలలు, ఇతర విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. అలాగే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, కోర్టులు రేపు పనిచేయవు. విద్యార్థులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇది అధికారిక సెలవు దినం.

Nationwide Holiday on April 14 Schools Colleges and Banks Closed for Ambedkar Jayanti Trading to Resume Wednesday

బ్యాంకింగ్ సేవలకు అంతరాయం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల జాబితా ప్రకారం, ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు యథావిధిగా అందుబాటులో ఉన్నప్పటికీ, ఫిజికల్ బ్యాంకింగ్ కార్యకలాపాలు, చెక్కుల క్లియరెన్స్ వంటి సేవలకు అంతరాయం కలగనుంది. ఖాతాదారులు తమ బ్యాంకింగ్ పనులను ముందే ప్రణాళిక చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

స్టాక్ మార్కెట్లకు వరుస విరామాలు

గత వారం గుడ్‌ఫ్రైడే, మహావీర్ జయంతి సెలవులతో ఇప్పటికే రెండు రోజులు ట్రేడింగ్‌కు విరామం లభించగా, రేపు అంబేద్కర్ జయంతి సందర్భంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. 2026 సంవత్సరంలో ప్రకటించిన మొత్తం 16 సెలవుల్లో ఇప్పటికే 6 పూర్తవ్వగా, రేపటి సెలవు తర్వాత ఈ ఏడాదిలో మరో 9 ట్రేడింగ్ సెలవులు మాత్రమే మిగిలి ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+