కమల్ హాసన్ వ్యాఖ్యలపై రాజ్ ఆగ్రహం, పద్మావతి సినిమా పైన కూడా
హిందూ ఉగ్రవాదం అంటూ సినీ నటుడు చేసిన వ్యాఖ్యలను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం తీవ్రంగా స్పందించారు. కమల్ హాసన్ వ్యాఖ్యలు అర్థరహితమన్నారు.
చెన్నై: హిందూ ఉగ్రవాదం అంటూ సినీ నటుడు చేసిన వ్యాఖ్యలను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం తీవ్రంగా స్పందించారు.
కమల్ హాసన్ వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. కేవలం ఓట్ల కోసమే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తాము సహించమన్నారు.

హిందువుల్లో ఉగ్రవాదం పెరుగుతోందన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడటం కమల్‌కు సరికాదన్నారు. బాలీవుడ్ సినిమా పద్మావతిపై కూడా ఆయన స్పందించారు. చరిత్రను వక్రీకరించారనే ప్రశ్నలు తలెత్తినప్పుడు ప్రదర్శననలు నిలిపేయాల్సి వస్తుందన్నారు.












Click it and Unblock the Notifications