రాజ్‌నాథ్‌తో కేంద్ర హోం శాఖ కార్యదర్శి భేటీ: వేటుకే మొగ్గు?
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామిపై కేంద్ర ప్రభుత్వం వేటు వేయనుంది. శారదా చిట్ ఫండ్ కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రి మాతాంగ్ సింగ్‌ను అరెస్టు చేయకుండా ఆయన సీబీఐ అధికారులతో మాట్లాడటంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఈ ఉదయం కార్యాలయానికి రాగానే తనను కలవాలని గోస్వామికి రాజ్ నాథ్ కబురు పంపారు. దీంతో అనిల్ గోస్వామి బుధవారం హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను కలిశారు. దాదాపు గంటసేపు వారు చర్చలు జరిపారు. ఈ భేటీలో తాను మాతాంగ్ సింగ్‌ను సీబీఐ అరెస్టు చేయకుండా అడ్డుకున్నట్లు అంగీకరించినట్లు సమాచారం.

దీంతో రాజ్‌నాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు అనిల్ గోస్వామిని హోం శాఖ కార్యదర్శిగా కొనసాగించలేమని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. భేటీ తర్వాత మీడియాతో మాట్లాడేందుకు అనిల్ గోస్వామి ఇష్టపడలేదు. దీంతో ఆయనపై వేటు పడే అవకాశం ఉందని జాతీయ మీడియాలో వార్తా కథనాలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications