వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంపన్న మహిళలను రప్పించి!: అంతమందితో ఒక్కడే, డేరా బాబా 'రూబరూ' పార్టీ

డేరా బాబా ఆశ్రమం అతని ఆకృత్యాలకు ఓ పుట్ట లాంటిదనే చెప్పాలి. దాన్ని తవ్వినకొద్ది వాటి జాబితా పెరుగుతూనే ఉంది. తాజాగా డేరా బాబా సాగించిన మరో రాసలీల కార్యక్రమం గుట్టు రట్టయింది.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Gurmeet Ram Rahim Singh : సంపన్న మహిళలను రప్పించి!: అంతమందితో ఒక్కడే | Oneindia Telugu

చంఢీగఢ్: డేరా బాబా ఆశ్రమం అతని ఆకృత్యాలకు ఓ పుట్ట లాంటిదనే చెప్పాలి. దాన్ని తవ్వినకొద్ది వాటి జాబితా పెరుగుతూనే ఉంది. తాజాగా డేరా బాబా సాగించిన మరో రాసలీల కార్యక్రమం గుట్టు రట్టయింది. రూబరూ పేరుతో ఆశ్రమంలో జరిగే పార్టీల్లో గుర్మీత్ బాబా సంపన్న మహిళలతో చిందేసేవాడని అధికారులు గుర్తించారు.

'సెక్స్' లేక జైల్లో ఇలా!: డేరా బాబాకు అదంటే విపరీతమైన పిచ్చి, ఆస్ట్రేలియా నుంచి ఔషధాలు'సెక్స్' లేక జైల్లో ఇలా!: డేరా బాబాకు అదంటే విపరీతమైన పిచ్చి, ఆస్ట్రేలియా నుంచి ఔషధాలు

తాజాగా ఒక ఫేస్ బుక్ స్క్రీన్ షాట్ ఆధారంగా విచారణ సాగించిన పోలీసులకు ఈ విషయం తెలిసినట్లు సమాచారం. గుర్మీత్ అత్యంత సన్నిహితురాలైన హనీప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో ఈ 'రూబరూ' పార్టీల ఏర్పాట్లు జరిగేవట. కేవలం సంపన్న వర్గాల మహిళలకు మాత్రమే ఇందులో ఆహ్వానం ఉండేదట. ఈ పార్టీలోకి ప్రవేశమున్న ఏకైక పురుషుడు గుర్మీత్ కావడం గమనార్హం.

'గుర్మీత్'కు ఎందుకింత ఫాలోయింగ్?: ఆ కారణంతోనే బాబా వెనుక లక్షల మంది..'గుర్మీత్'కు ఎందుకింత ఫాలోయింగ్?: ఆ కారణంతోనే బాబా వెనుక లక్షల మంది..

సంపన్న మహిళలకే ప్రవేశం:

సంపన్న మహిళలకే ప్రవేశం:

పార్టీకి వచ్చే సంపన్న మహిళల నుంచి ఒక్కొక్కరి వద్ద హనీప్రీత్ రూ.15వేల వరకు వసూలు చేసేదని తెలుస్తోంది. కొంతమంది సాధ్వీలను ఏజెంట్లుగా మలుచుకుని సంపన్న మహిళల జాబితా తయారుచేసి వారికి ఆహ్వానాలు పంపించేంది. ఆకర్షణీయమైన దుస్తుల్లో, విచిత్ర వేషధారణలో వారంతా పార్టీలకు వచ్చేవారు.

అంతమంది మహిళలతో గుర్మీత్ ఒక్కడే:

అంతమంది మహిళలతో గుర్మీత్ ఒక్కడే:

అంతమంది మహిళల మధ్యలో గుర్మీత్ శృంగారపురుషుడి అవతారం ఎత్తేవాడు. డబుల్ మీనింగ్ డైలాగులతో వారిని రెచ్చగొట్టేవాడు. వాళ్లు ఆడి పాడుతుంటే ఎంజాయ్ చేసేవాడు. చివరిగా ఎవరినైనా వలలో వేసుకుని రాత్రంతా తన రాసలీలు సాగించేవాడు. అరెస్టుకు ముందువరకు హనీప్రీత్ ఈ తరహా పార్టీలను చాలాసార్లే నిర్వహించారని తెలుస్తోంది. డేరా బాబా ఆకృత్యాలు రోజుకొకటి వెలుగుచూస్తుండటంతో ఆశ్రమంలో గుట్టు చప్పుడు కార్యాలు ఇంకెన్ని జరిగి ఉంటాయోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

హత్య కేసు విచారణ:

హత్య కేసు విచారణ:

సాధ్వీలపై అత్యాచారం కేసులో 20ఏళ్ల శిక్ష పడ్డ గుర్మీత్ బాబా.. నేడు హత్య కేసుల విచారణను ఎదుర్కొన్నారు. హర్యానాలోని పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు కేసును విచారిస్తోంది. శనివారం గుర్మీత్ కోర్టుకు హాజరుకావాల్సి ఉండటంతో పంచకులలో భద్రతను పెంచారు. పారామిలటరీ దళాల మోహరింపుకు డీజీ బీఎస్ సింధు ఆదేశాలిచ్చారు.

పంచకులలో భద్రత కట్టుదిట్టం:

పంచకులలో భద్రత కట్టుదిట్టం:

సిర్సా కేంద్రంగా పనిచేసిన రామచందర్ ఛత్రపతితో పాటు, డేరా మేనేజర్ రంజిత్ సింగ్ ల హత్య కేసుల్లో డేరా బాబాపై ఆరోపణలున్నాయి. 2002లో ఈ హత్యలు చోటు చేసుకున్నాయి.

సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ కేసులను విచారిస్తుండటంతో.. వాదనల నిమిత్తం శనివారం డేరా బాబాను కోర్టుకు తీసుకురానున్నారు. గత అగస్టు 25వ తేదీన బాబాకు శిక్ష పడిన సందర్భంగా చెలరేగిన అల్లర్లను దృష్టిలో ఉంచుకుని భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. అయితే గతంలో లాగా బాబా భక్తులు ఎవరూ పంచకులకు వస్తున్న సూచనలేవి కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు.

English summary
Security has been tightened in Panchkula town in Haryana ahead of a crucial hearing in two separate murder cases against Dera Sacha Sauda sect chief Gurmeet Ram Rahim Singh and others today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X