రాఖీ సావంత్‌కు హనీప్రీత్ షాక్: రూ.5 కోట్లకు పరువు నష్టం దావా, సవతి వ్యాఖ్యలే కారణమా?

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: డేరాబాబా దత్త పుత్రిక హనీ‌ప్రీత్ ఇన్సాన్‌ల విషయంలో సంచలన ఆరోపణలు చేసిన సినీ నటి రాఖీ సావంత్‌పై హనీప్రీత్ పరువు నష్టం దావా వేసింది.హనీప్రీత్ తల్లి ఆశా తనేజా ఇచ్చిన ఫిర్యాదు మేరకు రోహ్ తక్ పోలీసులు కేసు నమోదు చేశారు.

డేరాబాబా గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్ అరెస్ట్ సమయంలో పంచకులలో అల్లర్లు చోటు చేసుకొన్నాయి. ఈ అల్లర్లలో ప్రధాన నిందితురాలిగా హనీప్రీత్ ఇన్సాన్‌పై ఆరోపణలు వచ్చాయి.ఈ కేసులో ఆమె అరెస్టయ్యారు.

రామ్ రహీమ్ సింగ్ బాబా- హనీప్రీత్ అనుబందంపై సవతి వ్యాఖ్యలు చేసినందుకుగానురాఖీ సావంత్‌పై పరువు నష్టం దావా వేసింది హనీప్రీత్ సింగ్. ఈ విషయమై హనీప్రీత్ ఇన్సానీ తల్లి ఆశా తనేజా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

 సవతి వ్యాఖ్యలపై రూ.5 కోట్ల పరువు నష్టం దావా

సవతి వ్యాఖ్యలపై రూ.5 కోట్ల పరువు నష్టం దావా

సినీ నటి రాఖీ సావంత్ ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడి తన కూతురి పరువును భంగం కల్గించారని హనీప్రీత్ తల్లి ఆశా ఆరోపించారు. రాఖీ సావంత్ తన తప్పును ఒప్పుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ విషయమై క్షమాపణ చెప్పాలన్నారు. లేకపోతే రూ.5 కోట్లు చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు.

డేరాబాబా విషయంలో రాఖీ సంచలన వ్యాఖ్యలు

డేరాబాబా విషయంలో రాఖీ సంచలన వ్యాఖ్యలు

గత ఏడాది ఆగష్టు సమయంలో డేరాబాబా అరెస్టైన సమయంలో రాఖీ సావంత్ స్పందించారు.డేరా బాబాకు చాలా దగ్గరయ్యాను. మా ఇద్దరిదీ పవిత్రబంధం. ఎందుకోగానీ హనీప్రీత్‌కు ఇది నచ్చేదికాదు. బాబాకు నాకు మధ్య సాన్నిహిత్యాన్ని హనీ జీర్ణించుకోలేకపోయేదని రాఖీసావంత్ ఆరోపించారు.. డేరాబాను పెళ్లి చేసుకుంటే ఎక్కడ సవతిని అవుతానోనని హనీ భయపడేదని రాఖీసావంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 జైలులోనే డేరాబాబా, హనీప్రీత్

జైలులోనే డేరాబాబా, హనీప్రీత్

డేరాబాబా, హనీప్రీత్ ఇన్సాన్లు జైలులోనే ఉన్నారు. సాధ్వీలపై అత్యాచారం చేశారనే ఆరోపణలపై డేరాబాబాకు సిబిఐ ప్రత్యేక కోర్టు 20 ఏళ్ళ పాటు శిక్షను విధించింది. అయితే డేరాబాబా అరెస్టైన తర్వాత జరిగిన అల్లర్ల కేసులో కీలకపాత్ర పోషించారనే ఆరోపణలపై హనీప్రీత్‌ అరెస్టై జైలులో శిక్షను అనుభవిస్తున్నారు.

 డేరా బాబాపై సినిమాలో రాఖీ ప్రధాన పాత్ర

డేరా బాబాపై సినిమాలో రాఖీ ప్రధాన పాత్ర

డేరాబాబా-హనీప్రీత్ ఇన్సాన్‌లపై సినిమా నిర్మాణం అవుతోంది ఈ సినిమాలో రాఖీసావంత్ ప్రధాన పాత్రను పోషిస్తోంది. ఈ సినిమా త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.అయితే రాఖీసావంత్‌పై హనీప్రీత్ పరువు నష్టం దావా వేయడంతో ఈ విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Honeypreet Insan's mother has sent a legal notice to actress Rakhi Sawant seeking an apology for defaming her daughter.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి