కులాంతర వివాహం: కన్న కూతుర్నే చంపేశారు

ప్రభుత్వ ఉద్యోగి అయిన అభిషేక్ సేథ్(24)ను ప్రేమించిన భావనా యాదవ్, అతడ్ని నవంబర్ 12న ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకుంది. కాగా, ఈ వివాహంతో తమ పరువు పోయిందని భావించిన భావన తల్లిదండ్రులు జగ్మోహన్ యాదవ్, సావిత్రిలు నవంబర్ 14వ తేదీన వారి ఇంటికి వెళ్ళారు.
తాము ఈ వివాహానికి ఒప్పుకుంటున్నామని, ఘనంగా రిసెప్షన్ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి భావనను తమ వెంట తీసుకెళ్ళారు. ఆ రాత్రే ఆమెను హత్య చేశారు. ఆ తర్వాత భావనను పాము కరిచిందని ఇరుగుపొరుగు వారితో చెప్పి స్వగ్రామానికి తీసుకెళ్లి ఖననం చేశారు.
అభిషేక్ ఫిర్యాదు మేరకు భావన తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నామని డిప్యూటీ కమిషనర్ సుమాన్ గోయల్ తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించామని చెప్పారు.
కాగా, తక్కువ కులం వాడిని వివాహం చేసుకుని బంధువుల ముందు తాము సిగ్గుపడేలా చేసినందుకే కూతురుని చంపామని జగ్మోహన్, సావిత్రిలు పోలీసులు ముందు అంగీకరించారు. అయితే ఆమెను ఎలా చంపారన్న విషయమై విచారణ జరుపుతున్నామని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications